Headlines

శ్రీహరి కుటుంబం నుంచి వారసుడి ఎంట్రీ..


చాలా ఏళ్ల తర్వాత దివంగత రియల్ స్టార్ శ్రీహరి పేరు మళ్లీ వినిపిస్తోంది. ఆయన నట వారసుడు మేఘాంశ శ్రీహరి ఆస్మాన్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. లవ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో కూడిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అరబిక్ లో కూడా విడుదల కానుంది. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘాంశ సరసన రైంచా కోక్కరా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆస్మాన్ టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. చర్చిలో కళ్లకు గంతలు కట్టుకున్న వ్యక్తులు, లార్వా స్టేజ్ అంటూ చెప్పే డైలాగ్ వంటి విజువల్స్ కథపై సస్పెన్స్‌ను సృష్టించాయి. మిస్టరీతో పాటు హీరో, హీరోయిన్‌ల మధ్య రొమాంటిక్ ట్రాక్‌ను కూడా హైలైట్ చేశారు. టీజర్ చివరిలో మేఘాంశ యాక్షన్ స్టంట్స్ సినిమాకు మాస్ టచ్ ఇచ్చాయి. తండ్రికి తగ్గ తనయుడిగా మేఘాంశ యాక్షన్ మోడ్‌లో బరిలోకి దిగుతున్నాడని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్ర టీజర్ లాంచ్‌కు ప్రముఖ నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండ్రిలాగే మేఘాంశ కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటాడేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: జైలర్ 2 సెన్సార్ విషయంలో మేకర్స్ హర్ట్ అయ్యారా..?

ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్‌

UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు

AIకి చెక్‌ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్‌

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *