Headlines

IT Stocks: ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఎందుకు పెరిగాయి?


IT Stocks: భారత స్టాక్ మార్కెట్‌లో ఐటీ కంపెనీల షేర్లు మరోసారి జోరందుకున్నాయి. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో గణనీయంగా పెరిగాయి. మెరుగైన త్రైమాసిక ఫలితాలు, రాబోయే నెలల్లో పెద్ద డీల్స్ ఖరారయ్యే అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత షేర్లలో చోటుచేసుకున్న ఒడిదుడుకులు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఐటీ షేర్లలో ఎంత పెరుగుదల నమోదైంది?

అక్టోబర్ 16 ఉదయం ట్రేడింగ్ సమయంలో ఐటీ రంగానికి చెందిన ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి.

టెక్ మహీంద్రా: సుమారు 7.11% పెరుగుదల ఉండగా, విప్రో దాదాపు 4% పెరుగుదల ఉంది. అలాగే ఇన్ఫోసిస్ సుమారు 3.71% పెరుగుదల, టీసీఎస్: దాదాపు 3.19% పెరుగుదల, అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఉదయం ట్రేడింగ్‌లో సుమారు 2.8% లాభంతో ఉంది.

1. టెక్ మహీంద్రా ఫలితాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహం:
టెక్ మహీంద్రా రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించడంతో ఆ కంపెనీ షేర్లపై కొనుగోళ్ల ఆసక్తి పెరిగింది. మెరుగైన ఆదాయం, బలమైన డీల్స్ కంపెనీ పనితీరుపై పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32.74% పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న షేరు ధర 8%కు పైగా పెరిగినట్లు నివేదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *