Headlines

Bigg Boss Telugu 10: పీరియడ్స్ వచ్చిన కూడా ఆ పనులు చేయాల్సిందే.. బిగ్ బాస్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన దక్షి


అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా దాదాపు 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో వారం రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఏడో వారంలో భాగంగా ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ లో సత్తా చాటిన షాలినీ పటేల్, అలాగే వైల్డ్ కార్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దక్షి గుత్తి కొండ ఇద్దరూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దక్షికి అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇదే క్రమంలో ఆమె వరుసగా ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతోంది. ఈ సందర్భంగా తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తకర విషయాలు చెబుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం ఎలా ఉన్నా కూడా.. వీకెండ్‌లో ధగధగ మెరిసిపోతుంటారు కంటెస్టెంట్స్. మరి వాళ్లకి మేకప్ ఎలా? హౌస్‌లోకి ఎవరైనా వెళ్లి రెడీ చేస్తారా? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దక్షి మాటల్లో దొరికేశాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

‘బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పనులు వారే చేసుకోవాలి. మేకప్‌తో సహా ఎవరి పనులన్నీ వాళ్లే సొంతంగా చేసుకోవాల్సిందే. వారానికి ఒకసారి ఐబ్రో రేజర్ పంపిస్తారు. దాంతోనే అందరూ ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం నెయిల్ కట్టర్ పంపిస్తారు. రేజర్‌తోనే ఐబ్రోస్ చేసుకోవాలి. అలాగే వ్యాక్సింగ్ స్టిప్స్ కూడా అలౌవ్ చేస్తారు. రెగ్యులర్ వ్యాక్స్‌కి అంత సీన్ లేదు. హౌస్ లో ఎవరు ఎలా రెడీ అవుతున్నారో బయటకు చూపించరు.. చూపించకూడదు కూడా. ముస్తాబవ్వడానికి హౌస్ లో సెపరేట్ రూం అంటూ ఉండదు. బాత్ రూం దగ్గరే ఐబ్రోస్, వ్యాక్స్‌లాంటివి చేసుకుంటారు. క్యాస్ట్యూమ్స్ వెళ్లేటప్పుడే తీసుకుని వెళ్లాలి.. వీకెండ్ క్యాస్ట్యూమ్స్ మాత్రం బయట నుంచి వస్తుంటాయి. ఒకరి బట్టల్ని ఒకరు వేసుకునే వారు. వాషింగ్ మొత్తం కూడా ఎవరివి వాళ్లే చేసుకోవాలి. అయితే అవన్నీ ఎడిటింగ్‌లో తీసేస్తారు. పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ పంపిస్తారు. ఒక్కొక్కరికీ నాలుగైదు పంచుకుంటారు. ఒకవేళ సరిపోక మళ్లీ కావాలంటే వెళ్లి కెమెరా దగ్గర చెప్తే పంపిస్తారు. అవి కూడా అడగాల్సిందే. పీరియడ్స్ టైమ్‌లో కూడా టాస్క్‌లు పెడితే ఆడాల్సిందే. రిలీప్ కోసం కొన్నిట్యాబ్లెట్స్ ఇస్తారు. అది వేసుకుని టాస్కులు ఆడాల్సిందే. ఏవైనా దెబ్బలు తగిలినా కూడా.. మనం కావాల్సిన మందులు పంపమంటే పంపరు. మనకి ఏదైనా అయితే వాళ్లు డాక్టర్లను పంపిస్తారు. వాళ్లు చూసి మనకేం ఇవ్వాలో అది ఇస్తారు’

‘ఇక బిగ్ బాస్ హౌస్‌లో నిద్ర అయితే అసలు సరిగ్గా ఉండదు. ఫుడ్ కూడా సరిపోయేటంత ఉండదు. నాన్ వెజ్ చాలా తక్కువ. ఒకవేళ పంపించినా కూడా అందరికీ సరిపోదు ‘అప్పుడప్పుడూ హౌస్ లో మెట్రో ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. దాని సౌండ్‌ని బట్టి.. లాస్ట్ ట్రైన్ అనుకుని టైమ్ ఎంత అవుతుందో తెలుసుకునేవాళ్లం ’ అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది దక్షి. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి



బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 0 లేటెస్ట్ ప్రోమో..

Watch: ఇంత సడెన్ ఎంట్రీ ఇస్తే ఎట్లాగమ్మా.. కూతురిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన తల్లి!



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *