Headlines

హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. ఆయిల్ ట్యాంకర్‌పై దాడి .. నౌకలో 21 మంది భారతీయులు!


పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి హార్మూజ్ జలసంధిలో వెలుగు చూశాయి. కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న MT అల్ దస్మా అనే ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తు తెలియని ప్రొజెక్టైల్ దాడి జరిగింది. ఈ ఘటన అక్టోబర్ 21న ఒమన్‌లోని బుకా ప్రాంతానికి పశ్చిమంగా 11 నాటికల్ మైళ్ల దూరంలో జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) గుర్తించింది.దాడితో నౌకలో మంటలు చెలరేగగా, అప్రమత్తమైన సిబ్బంది వాటిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ట్యాంకర్‌లో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి జరిగినప్పటికీ, వారంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సెర్బానంద సోనోవాల్ వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సిబ్బంది భద్రతపై షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

భారీగా తగ్గిన బంగారం ధర

ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్

సౌత్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్‌

పెళ్లి పీటలెక్కనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్

దసరా జోరు.. దీపావళి వరకు కొనసాగేనా మరి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *