కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): భాగ్య స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల వారం రోజుల పాటు జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యానికి, గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు సజావుగా, సానుకూలంగా పురోగతి చెందుతాయి. అధికారులకు నమ్మకం పెరగడం వల్ల పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరిపో తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోవద్దు. ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.