Headlines

6 ఓవర్లు.. 6గురు ఆటగాళ్లు.. పాక్‌తో పోరుకు సిద్ధమైన భారత్.. హాంకాంగ్ సిక్సెస్ ఫుల్ షెడ్యూల్ ఇదే..!


Hong Kong Sixes Schedule: క్రికెట్ అభిమానులకు మరో ప్రత్యేకమైన టోర్నీ సందడి చేయబోతోంది. హాంకాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరగనుంది. వేగవంతమైన ఆరు ఓవర్ల ఫార్మాట్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ. భారత్ జట్టులో ఐపీఎల్ అనుభవం ఉన్న పలువురు ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

హాంకాంగ్ సిక్సెస్ అంటే?

హాంకాంగ్ సిక్సెస్‌లో ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. సాధారణంగా కౌలూన్ క్రికెట్ క్లబ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. క్రికెట్ హాంకాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నీకి ఐసీసీ గుర్తింపు ఉంది.

హాంకాంగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ సిక్సెస్ 1992లో ప్రారంభమై 2017 వరకు జరిగింది. కొంత విరామం తర్వాత 2024లో తిరిగి ప్రారంభమైంది. షేన్ వార్న్ (Shane Warne), వసీం అక్రమ్ (Wasim Akram), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell), దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) వంటి ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడారు.

ఇవి కూడా చదవండి



కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!

హాంకాంగ్ సిక్సెస్ 2026 రూల్స్..

– ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు.

– ఒక్కో ఇన్నింగ్స్ గరిష్ఠంగా 6 ఓవర్లు.

– వికెట్ కీపర్ మినహా మిగతా ప్రతి ఫీల్డర్ ఒక్కో ఓవర్ బౌలింగ్ చేయాలి.

– ఐదు వికెట్లు పడితే చివరి బ్యాటర్ కొనసాగుతాడు. ఐదో బ్యాటర్ రన్నర్‌గా ఉంటాడు.

– 50 పరుగులు చేసిన బ్యాటర్ రిటైర్ కావాలి. మిగతా బ్యాటర్లు ఔట్ లేదా రిటైర్ అయిన తర్వాత తిరిగి బ్యాటింగ్ చేయవచ్చు.

– ఒక్క మ్యాచ్‌ను 45 నిమిషాల్లో పూర్తి చేయాలి.

టోర్నీ ఫార్మాట్..

12 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు.

పూల్ A: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, హాంకాంగ్ చైనా

పూల్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్

పూల్ C: భారత్, పాకిస్థాన్, యూఏఈ

పూల్ D: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఒమన్

ప్రతి పూల్‌లో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి పూల్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు కప్ సెమీఫైనల్స్‌కు చేరతాయి. మిగతా జట్లకు ప్లేట్, బౌల్ పోటీలు ఉంటాయి.

Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!

భారత్ జట్టు..

హాంకాంగ్ సిక్సెస్ 2026లో భారత్‌కు క్రుణాల్ పాండ్యా (Krunal Pandya) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో నితీష్ రాణా, శశాంక్ సింగ్, టీ. నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా, కుల్వంత్ ఖెజ్రోలియా ఉన్నారు.

భారత్ తొలి మ్యాచ్ అక్టోబర్ 30న పాకిస్థాన్‌తో ఉదయం 11:45 గంటలకు జరగనుంది. అక్టోబర్ 31న ఉదయం 8:05 గంటలకు యూఏఈతో భారత్ తలపడుతుంది.

గత విజేతలు..

హాంకాంగ్ సిక్సెస్ చరిత్రలో పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా విజయాల్లో ముందున్నాయి. భారత్ 2005లో టైటిల్ గెలిచింది. 2024లో శ్రీలంక విజేతగా నిలవగా, 2025లో పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచింది.

లైవ్ స్ట్రీమింగ్..

హాంకాంగ్ సిక్సెస్ 2026 మ్యాచ్‌లను ఫ్యాన్‌కోడ్ (FanCode)లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు లైవ్‌గా చూడవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *