Headlines

Jason Sanjay : వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు.. నమ్మొద్దని హెచ్చరించిన జాసన్ సంజయ్..


సెలబ్రిటీల పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, నకిలీ ప్రచారాలు నడవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోలు లేదా ప్రముఖుల వారసులు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి వదంతులు మరింత ఎక్కువగా వస్తుంటాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌ కుమారుడు, యువ దర్శకుడు జాసన్ సంజయ్ తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తన పేరుతో ఎలాంటి అధికారిక అభిమాన సంఘాలు లేదా సోషల్ మీడియా పేజీలను ప్రారంభించలేదని ఆయన స్పష్టం చేశారు. తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా స్పష్టతనిచ్చిన జాసన్ సంజయ్.. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఖాతాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. తన పేరు లేదా ఫొటోలతో ఉన్న ఫేక్ అకౌంట్ల నుంచి వచ్చే పోస్టులు, కామెంట్లతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అభిమానులు ఎవరూ అలాంటి నకిలీ సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని, ఎవరైనా తన పేరుతో కొత్తగా అధికారిక ఫ్యాన్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేస్తే వాటిని విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

కాగా, జాసన్ సంజయ్ కేవలం నటుడి కుమారుడిగా మాత్రమే కాకుండా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ‘సిగ్మా’ చిత్రంతో ఆయన దర్శకుడిగా టాలీవుడ్‌లో/కోలీవుడ్‌లో సంచలన అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. భవిష్యత్తులోనూ విభిన్నమైన కథలతో ముందుకు వెళ్లనున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

అయితే దర్శకుడిగానే కాకుండా హీరోగానూ త్వరలోనే తెరంగేట్రం చేయనున్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అట్లీ హీరోగా వెండితెరపై సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ హీరోగా రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనంతరం జాసన్ సంజయ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *