Headlines

ఏంటి బాసూ రూ.1.14 కోట్ల ధర, 285 కి.మీ టాప్​ స్పీడ్ వెళ్లే కారు​! లగ్జరీ SUV పూర్తి వివరాలివే


Grecale Faceliftతో పాటు అప్‌డేట్ చేసిన GranTurismo, GranCabrio మోడళ్లను కూడా Maserati భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Grecaleలో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ Folgore వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 300HP నుంచి 530HP వరకు పవర్ అందించే పెట్రోల్ ఇంజిన్లు, 550HP పవర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉన్నాయి. కొత్త ఎక్ట్సీరియర్ డిజైన్, డిజిటల్ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్‌తో ఈ SUVని అప్‌డేట్ చేశారు.

ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా!

కొత్త Maserati Grecaleలో పలు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 300HP పవర్, 450Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV 5.6 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠ వేగం గంటకు 240 కిలోమీటర్లు. Modena వేరియంట్‌లో ఇదే ఇంజిన్ 330HP పవర్‌ను అందిస్తుంది. ఇది 5.3 సెకన్లలో 100 kmph వేగాన్ని చేరుకుంటుంది.

Modena V6లో 3.0 లీటర్ Nettuno V6 ఇంజిన్ 390HP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4.9 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకుని, గంటకు 260 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక Trofeo వేరియంట్‌లో ఇదే 3.0 లీటర్ V6 ఇంజిన్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ఇది 530HP పవర్, 620Nm టార్క్‌ను అందిస్తుంది. మరోవైపు Folgore ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రెండు మోటార్లు కలిపి 550HP పవర్, 820Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ మోడల్ 4.1 సెకన్లలో 100 kmph వేగాన్ని చేరుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

డిజిటల్ ఫీచర్లు

Grecale Facelift ముందు భాగంలో షార్క్-నోస్ స్టైల్‌ను పోలిన బంపర్, కొత్త కాన్కేవ్ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్ అందించారు. గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు ముందు చక్రాల ఆర్చ్‌ల వద్ద ఎయిర్ కర్టెన్స్ ఏర్పాటు చేశారు. Trofeoలో మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, ఇతర వేరియంట్లలో ఫుల్ LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. కొత్త 20 అంగుళాల Asteria, 21 అంగుళాల Crono అల్లాయ్ వీల్ డిజైన్లను కూడా అందించారు.

ఇంటీరియర్‌లో ఆక్టాగోనల్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం ప్యాడిల్ షిఫ్టర్లు, అప్‌డేట్ చేసిన డిజిటల్ క్లాక్ ఉన్నాయి. అన్ని వేరియంట్లలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ కోసం 8.8 అంగుళాల స్క్రీన్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto సపోర్ట్ లభిస్తాయి. Maserati Intelligent Assistant కూడా ఉంది. ఎంట్రీ లెవల్ మోడల్ మినహా మిగతా వేరియంట్లలో 14-స్పీకర్ల Sonus Faber ఆడియో సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *