Air Conditioner: వర్షాకాలంలో ఏసీలో ఈ మోడ్ ఆన్ చేస్తే కరెంట్ బిల్లు భారీగా ఆదా.. ఈ ట్రిక్ చాలామందికి తెలియదు..

Air Conditioner: వర్షాకాలంలో ఏసీలో ఈ మోడ్ ఆన్ చేస్తే కరెంట్ బిల్లు భారీగా ఆదా.. ఈ ట్రిక్ చాలామందికి తెలియదు..


సమ్మర్‌కు ఎండ్ కార్డ్ పడింది. వర్షాకాలం వచ్చేస్తోంది. నైరుతి రుతుపవనాల రాకతో దాదాపు వర్షాకాలం మొదలైపోయిందని చెప్పవచ్చు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు ఇప్పటినుంచే కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మొన్నటివరకు ఎండ వేడి వల్ల ఇళ్లల్లో ఏసీలను ఎక్కువగా ఉపయోగించారు. కానీ వర్షాకాలం మొదలుకానుండటంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గిపోన్నాయి. దీంతో ఏసీల వినియోగం కూడా తగ్గుతుంది. ఏసీలకు అలవాటుపడినవారు వర్షాకాలంలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. అయితే వర్షాకాలంలో ఏసీని కూల్ మోడ్‌లో కంటే డ్రై మోడ్‌లో ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. డ్రై మోడ్ వల్ల ప్రయోజనాలేంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

డ్రై మోడ్ ఉపయోగించండి

డ్రై మోడ్ గాలిలోని అదనపు తేమను తగ్గించి గదిని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. అంతేకాకుండా విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గించడం వల్ల మీకు కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. అధిక తేమ ఉన్న వాతావరణ పరిస్థితుల కోసం ఈ మోడ్ అభివృద్ది చేశారు. ఈ మోడ్‌లో ఏసీ ఉన్నప్పుడు కంప్రెసర్ నిరంతరాయంగా కాకుండా మధ్యమధ్యలో పనిచేస్తుంది. ఏసీలోని ఫ్యాన్ వేగం కూడా సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ గది గాలిలోని తేమ.. నీటి బిందువులుగా ఘనీభవించి బయటకు వెళ్ళిపోతుంది. దీని వల్ల గదిలోని గాలి మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కూల్ మోడ్ మన గదిలోని వేడిని బయటకు పంపించి రూమ్‌ను చల్లగా చేస్తుంది. ఇందుకోసం ఏసీ కంప్రెసర్ నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కారణం వల్ల కరెంట్ బిల్లు అనేది పెరుగుతుంది.

డ్రై మోడ్ వల్ల విద్యుత్ ఆదా ఎలా..?

డ్రై మోడ్‌లో కంప్రెసర్ అనేది నిరంతరం పనిచేయదు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దీంతో మీరు కరెంట్ బిల్లును ఆదా చేసుకోవాలంటే.. వర్షాకాలంలో డ్రై మోడ్‌ను ఉపయోగించడం బెటర్. డ్రై మోడల్‌లో ఏసీ టెంపరేచర్‌ను 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీ గాలిలోని తేమను సమర్థవంతంగా  తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏసీ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. శుభ్రమైన ఫిల్టర్లు ఏసీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇక ఏసీనే కాకకుండా సీలింగ్ ఫ్యాన్‌ను డ్రై మోడ్‌లో తక్కువ వేగంతో నడపడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తేమ లేని గాలిని గది అంతటా సమానంగా ప్రసరింపజేస్తుంది. వర్షాకాలంలో ఏసీని ఉపయోగించేవారు ఈ ట్రిక్స్ పాటించడం వల్ల లాభం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *