Personal Finance: గుడ్ న్యూస్.. జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Personal Finance: గుడ్ న్యూస్.. జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!


Personal Finance: ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో సీనియర్ సిటిజన్లు తమ జీవితకాల పొదుపు మొత్తానికి సురక్షితమైన, స్థిరమైన రాబడిని ఇచ్చే పెట్టుబడి మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కచ్చితమైన ఆదాయాన్ని అందించేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits – FD) ఎల్లప్పుడూ ఉత్తమ సాధనంగా నిలుస్తాయి. ప్రస్తుతం జూన్ 2026లో దేశంలోని పలు ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs) సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని బ్యాంకులు గరిష్టంగా 8.30% వరకు వడ్డీని అందిస్తూ మార్కెట్లో ముందంజలో ఉన్నాయి.

టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వడ్డీ రేట్లు (జూన్ 2026 నాటికి):

దేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి) వివిధ కాలపరిమితులపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. గరిష్టంగా 8.30% వరకు వడ్డీ రేటును అందిస్తూ సీనియర్ సిటిజన్ల రిటైర్మెంట్ ఫండ్స్ పై మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.

సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనం:

60 ఏళ్లు దాటిన వారికి సాధారణ పౌరుల కంటే 0.50% వరకు అదనపు వడ్డీ లభిస్తుంది. అయితే 80 ఏళ్లు పైబడిన ‘సూపర్ సీనియర్ సిటిజన్లకు’ మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్‌బీఎల్ (RBL) బ్యాంక్ వంటి సంస్థలు సాధారణ రేట్ల కంటే ఏకంగా 0.75% వరకు అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 0.80% p.a. వరకు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోందని పైసా బజార్‌ పేర్కొంది. ఈ డిపాజిట్లు చేసేవారు పలు గుర్తింపు పత్రాలను అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!

అవసరమైన గుర్తింపు రుజువు:

  • సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు
  • పాస్‌పోర్ట్
  • పాన్ కార్డు
  • ఓటరు గుర్తింపు కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఫోటో రేషన్ కార్డు
  • చిరునామా రుజువు
  • పాస్‌పోర్ట్
  • టెలిఫోన్ బిల్లు
  • విద్యుత్ బిల్లు
  • చెక్కుతో కూడిన బ్యాంకు స్టేట్‌మెంట్
  • తపాలా కార్యాలయం జారీ చేసిన సర్టిఫికేట్/ గుర్తింపు కార్డు

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టే ముందు, మీకు అవసరమైన నగదు గురించి స్పష్టంగా తెలుసుకోండి. ఎందుకంటే, తర్వాత గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకుంటే, రాబడి తగ్గే అవకాశం ఉంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందించే FD వడ్డీ రేట్ల పన్ను ప్రభావాలను సీనియర్ సిటిజన్లందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. తద్వారా వాస్తవ తుది రాబడులను లెక్కించవచ్చు. చివరగా డిపాజిట్ బీమాను, బ్యాంకు విశ్వసనీయతను తప్పకుండా తనిఖీ చేయండి. మీరు వ్యవహరించే బ్యాంకింగ్ సంస్థకు విశ్వసనీయత, నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటే, మీ నిధులకు అంత ఎక్కువ రక్షణ లభిస్తుంది.

(గమనిక: ఖచ్చితమైన కాలపరిమితులు మరియు తాజా నిబంధనల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లను తనిఖీ చేయవచ్చు).

ఇది కూడా చదవండి: Cash, Gold: మీ ఇంట్లో నగదు, బంగారం ఉన్నాయా? లెక్కలు చెప్పాల్సిందే.. లేకుంటే భారీ జరిమానా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *