ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన వన్డేలో టీమిండియా యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న గిల్ సేన.. ఈ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి గౌరవంగా సిరీస్ ముగించాలని పసికూన ఆఫ్ఘనిస్థాన్ భావిస్తోంది.
రోహిత్ శర్మ హ్యాట్రిక్..
అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదే రోహిత్ శర్మ హ్యాట్రిక్. వావ్.. రోహిత్ బౌలింగ్ చేసి హ్యాట్రిక్ సాధించాడా? అని ఆశ్చర్యపోకండి. రోహిత్ హ్యాట్రిక్ సాధించింది బౌలింగ్ వేసి.. క్యాచ్‌లు పట్టి. వరుసగా తొలి మూడు వికెట్లు రోహిత్ క్యాచ్ అందుకోవడంతోనే పడ్డాయి. పైగా బౌలర్ కూడా ఒక్కడే. ప్రసిద్ధ్ తీసిన తొలి మూడు వికెట్లు కూడా స్లిప్‌లో రోహిత్ క్యాచ్‌తోనే లభించాయి. ఏదో రీప్లే చూస్తున్నట్లు వరుసగా ఆ మూడు వికెట్లు దాదాపు ఒకే విధంగా పడ్డాయి. ఇలా క్యాచ్‌లతో రోహిత్ శర్మ హ్యాట్రిక్ సాధించాడు.
Identical setups, identical results 🔄
Prasidh Krishna 🤝 Rohit Sharma 😎
Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l
— BCCI (@BCCI) June 20, 2026
మొత్తంగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ప్రసిద్ధ్ రూపంలో వారికి గట్టి షాక్ తగిలింది. కేవలం 36 పరుగులకే ఆఫ్ఘాన్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ నాలుగు కూడా ప్రసిద్ధ్ కృష్ణకే దక్కాయి. తొలి వన్డేలో సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 5, మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 11, రెహమత్ షా 5, డార్విష్ రసూలీ ఒక్క పరుగుల చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కెప్టెన్ షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆఫ్ఘాన్ 99 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి