Headlines

Rohit Sharma: జూన్ 23.. పద్మ శ్రీ అవార్డు అందుకున్న రోహిత్.. 19 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా?

Rohit Sharma: జూన్ 23.. పద్మ శ్రీ అవార్డు అందుకున్న రోహిత్.. 19 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా?


టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ జీవితంలో నేడు(జూన్ 23, 2026) ఒక మరుపురాని రోజుగా నిలిచిపోతుంది. కారణం ఏంటంటే.. భారత ప్రభుత్వం అందించే ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తన కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా రోహిత్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించాడు. పద్మ అవార్డులు స్వీకరించడాన్ని చాలా మంది ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తారు. రోహిత్‌ కూడా ఎంతో సంతోషంగా, ఉద్వేగభరితంగా కనిపిస్తూ ఈ అవార్డును తీసుకున్నాడు. అయితే ఈ పద్మశ్రీ అవార్డును రోహిత్ శర్మకు ఈ రోజే బహూకరించడంతో అతనికి మరింత స్పెషల్‌గా మారింది. ఎందుకంటే దాని వెనుక ఒక స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఎన్ని రికార్డులు నెలకొల్పాడో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. భారత క్రికెట్‌కు దొరికిన అతికొద్ది మంది అద్భుతమైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. వన్డే క్రికెట్‌లో ప్రపంచం నివ్వెరపోయిన రికార్డు 264 పరుగులు కొట్టింది కూడా హిట్‌మ్యానే. కేవలం ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గా టీమిండియాకు 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీలు అందించాడు. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో వరుసగా 10 మ్యాచ్‌లో గెలిచి, ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌కు వెళ్లింది. ఆ కప్పు వచ్చి ఉంటే.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ పేరు ధోని సరసన ఉండేది.

ఇంత అద్భుతమైన కెరీర్ ఉన్న రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తొలి సారి టీమిండియా జెర్సీ ధరించిన రోజు ఏదో గుర్తుందా? కొంతమంది రోహిత్ ఫ్యాన్స్ అయితే టక్కున చెప్పుస్తుంటారు కానీ.. 2007 జూన్ 23న రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ రోజు రోహిత్‌కు ఎంత మధురమైన మెమొరీనో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. అయితే అంత ప్రత్యేకమైన రోజున అంటే అదే జూన్ 23న సరిగ్గా 19 ఏళ్ల తర్వాత పద్మశ్రీ అవార్డు అందుకోవడం మరింత స్పెషల్. 19 ఏళ్ల క్రితం ఇదే రోజు డెబ్యూ, ఇప్పుడు పద్మశ్రీ అవార్డు.. ఇది యాదృచ్ఛికంగా జరిగినా.. రోహిత్‌కు మాత్రం అలా కలిసొచ్చిందనే చెప్పాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *