Headlines

Peddi Movie: పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. ‘పెద్ది’ ఈవెంట్‌లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు

Peddi Movie: పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. ‘పెద్ది’ ఈవెంట్‌లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు


తన ప్రసంగాన్ని మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పడంతో బుచ్చిబాబు ప్రారంభించారు. “చిరు సార్, థాంక్యూ సో మచ్ సార్. నేను మా ఊర్లో ఉండి, పిఠాపురం నుంచి మీకు లెటర్లు పంపించే వాడిని. మీరుప్పుడైనా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని. నా మొదటి కథ మీ ఇంటికి వచ్చింది. నా సెకండ్ కథ పెద్ది కూడా మీ ఇంటికి వచ్చింది సార్’ అని చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు బుచ్చిబాబు. ఒక మనిషి సంకల్ప బలం ఉంటే ఎంత దూరం వస్తాడనేదే పెద్ది కథాంశమని ఆయన వివరించారు. ఇదే సందర్భంగా రామ్ చరణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారీ డైరెక్టర్. చరణ్ ఒక స్టార్ హీరో మాత్రమే కాదని, గొప్ప నటుడని ఆయన ఉద్ఘాటించారు. ‘ఒక స్టార్ హీరోతో కలిసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. పెద్దిలో మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు. రామ్ చరణ్ క్రమశిక్షణ, డెడికేషన్ ఎలాంటి దంటే.. సీన్‌కి వచ్చినప్పుడు ఒక స్టార్ లా రాలేదు. కారు దిగారేమో గానీ, సెట్‌లోకి మాత్రం పెద్ది లాగే నడుచుకుంటూ వచ్చారు. చరణ్ తన క్యారెక్టర్‌ను పది రెట్లు అద్భుతంగా పండించారు. ఆయన సహకారానికి జీవితాంతం రుణపడి ఉంటానని, పిలిచినప్పుడల్లా పరిగెత్తుకు వస్తాను ‘ అని బుచ్చిబాబు భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా పెద్ది చిత్రబృందానికి బుచ్చిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఛాయాగ్రాహకుడు రత్నవేలు, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, కళా దర్శకుడు అవినాష్ కొల్లా, ఎడిటర్ నవీన్ నూలీ సహా మొత్తం సాంకేతిక బృందానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా నిర్మాత వెంకట సతీష్ కిలారును ప్రశంసిస్తూ, “నేను కొత్త డైరెక్టర్‌ని అయినా ఎక్కడా రాజీ పడలేదు. ప్రతిరోజు సెట్‌కి వచ్చి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్ లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్” అని అన్నారు.

తన గురువు సుకుమార్‌కు బుచ్చిబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “సుక్కు సార్, మీరు లేకపోతే నేను లేనని” చెప్పి, సుకుమార్ అసిస్టెంట్‌గా పిలిపించుకోవడమే తనకు ఎక్కువ విలువ అని పేర్కొన్నారు. తన దర్శకత్వ బృందాన్ని వేదికపైకి ఆహ్వానించి, సినిమా విజయం వెనుక వారి కృషిని కొనియాడారు. అలాగే, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనిల్ రావిపూడి, సాహో, రవి వంటి ప్రముఖులకు కూడా ధన్యవాదాలు చెప్పార బుచ్చిబాబు. చివరగా, ఒక థియేటర్ అనుభవాన్ని పంచుకుంటూ, 75 ఏళ్ల వయస్సున్న ఒక పెద్దాయన పెద్ది సినిమా చూసి ఏడ్చారని, 25 ఏళ్ల క్రితం మాతృదేవోభవ చూసినప్పుడు ఏడ్చానని, మళ్లీ ఇప్పుడు ఏడ్చానని చెప్పినప్పుడు, “ఈ జన్మకి చాలురా” అనుకున్నానని బుచ్చిబాబు భావోద్వేగంగా అన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ఈ ఆదరాభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని, థాంక్యూ సో మచ్ అని తన ప్రసంగాన్ని ముగించారు బుచ్చిబాబు.

ఇవి కూడా చదవండి



ఫుల్ వీడియో ఇదిగో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *