Headlines

Telangana News: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. కొత్త కార్యక్రమానికి శ్రీకారం.

Telangana News: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. కొత్త కార్యక్రమానికి శ్రీకారం.


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించనుంది. రైతులకు ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా ఉన్న మహిళా సంఘాలను గుర్తించనుంది. వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసిన లైసెన్స్ అందించనున్నారు. అలాగే వీరికి యూరియా యాప్ వినియోగంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

రాష్ట్రంలో ప్రతీ ఏటా 40 లక్షల టన్నుల ఎరువులు రైతులకు సరఫరా అవుతున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలతో పాటు ప్రైవేట్ ఎరువు దుకాణాల ద్వారా రైతులు తీసుకుంటున్నారు. మహిళా సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని వల్ల రైతులు తమ గ్రామంలోనే ఎరువులు కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్కొ గ్రామంలో 5 నుంచి 10 వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో ఆసక్తిగల సంఘాలను అధికారులు ఎంపిక చేయనున్నారు. వీరికి ఎరువులను విక్రయించే బాధ్యతలను అప్పగించనున్నారు. దీని వల్ల రైతులతో పాటు మహిళా సంఘాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమం అమలు కోసం ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులతో పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు సమావేశమయ్యారు. మొదటి విడతలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అమలు చేశారు.  అనంతరం అక్కడ వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి అన్ని జిల్లాల్లో అమలు చేస్తారు.

ఇప్పటికే ప్రభుత్వం రైతు వేదికల ద్వారా విత్తనాలను సరఫరా చేసే కార్యక్రమం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అధికారులు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించారచు. అయితే పలు రైతు వేదికల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు విత్తనాలను భద్రపర్చేందుకు గిడ్డంగులు లేవు. దీంతో విత్తనాల పంపిణీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం ఆన్వేషిస్తోంంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *