Headlines

సూర్యాపేటలో రాజ్‌కుమార్ ఆచూకీ.. అక్కడికి బయలుదేరిన పోలీసు బృందాలు

సూర్యాపేటలో రాజ్‌కుమార్ ఆచూకీ.. అక్కడికి బయలుదేరిన పోలీసు బృందాలు


హైదరాబాద్‌ శివారులో 6 హత్యలు చేసి అదృశ్యమైన రాజ్‌కుమార్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌కుమార్ సూర్యాపేట–కోదాడ మధ్య ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సూర్యాపేట సమీపంలో రాజ్‌కుమార్ కనిపించినట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సమాచారాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అందిన సమాచారం మేరకు రాజ్‌కుమార్‌ను గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బృందాలను సూర్యాపేట వైపు పంపించారు.

సూర్యాపేట–కోదాడ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ధృవీకరిస్తూ, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆచూకీపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, సూర్యాపేట నుంచి వచ్చే తాజా సమాచారం కోసం అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *