
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్ పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి. ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని అందించనుంది. దీని ప్రారంభ ఛార్జీ, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఛార్జీల కంటే కూడా తక్కువ.