RailOne యాప్‌లో లభించే ఇతర సేవలు: కేవలం టికెట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ సూపర్ యాప్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనేక సేవలను అందిస్తోంది. రిజర్వ్డ్, అన్-రిజర్వ్డ్ టికెట్లు: జనరల్ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు ఒకే యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేషన్‌కు వెళ్లకముందే మొబైల్లోనే ప్లాట్‌ఫారమ్ టికెట్ పొందవచ్చు. రైలు ఎక్కడుంది? ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణ సమయంలో నేరుగా మీ సీటు వద్దకే భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. సింగిల్ సైన్-ఆన్ (SSO): ప్రతి సేవకు వేర్వేరు లాగిన్ అవసరం లేకుండా ఒకే ఖాతాతో అన్ని సేవలను పొందవచ్చు. రైల్వే శాఖ ఆగస్టు 2026 నాటికి తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను పూర్తిగా ఆధునీకరించి, ఈ కొత్త హై-స్పీడ్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత బలోపేతం చేయనుంది.