England vs India, 3rd ODI: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్‌తో రెచ్చిపోయింది. లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు కొండంత టార్గెట్‌ను ఉంచింది. బెన్ డకెట్ 141 పరుగుల వద్ద అవుటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్‌లోనే అతడిని క్యాచ్ పట్టాడు. డకెట్ తన 135 బంతుల ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. జాకెబ్ బెథెల్ 91 పరుగులు, హ్యారీ బ్రూక్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
ఈ మ్యాచ్‌కు భారత్ మూడు మార్పులు చేసింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమవ్వగా, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. సిరీస్ 1-1తో సమంగా ఉంది.
ప్లేయింగ్-11..
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..