Headlines

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే న్యూస్.. మరో కొత్త సేవలు వచ్చేశాయ్.. ఒకే క్లిక్‌తో అంతా..


తమ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే వాట్సప్ ఛానెల్. ఈపీఎఫ్ఓ పేరుతో ఒక వాట్సప్ ఛానెల్‌ను ప్రారంభించింది. పీఎఫ్‌కు సంబంధించి సమాచారం మొత్తం దీని ద్వారా ఒకేచోట తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ ఒకేచోట లభిస్తాయి. ఈపీఎఫ్ఓ తీసుకునే కొత్త నిర్ణయాలు, క్లెయిమ్ ప్రాసెస్, వడ్డీ జమ, పెన్షన్, బీమా సౌకర్యానికి సంబంధించిన అన్ని విషయాలు ఒకేచోట తెలుసుకోవచ్చు. ఇందుకోసం వివిధ ఫ్లాట్‌ఫామ్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఖాతాదారులకు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రతీఒక్కరి ఫోన్లలో వాట్సప్ అనేది ఉంటుంది. ఈ షార్ట్ మెస్సేజింగ్ యాప్ ద్వారా ఏ సమాచారం అయినా క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. దీంతో చందాదారులకు వేగవంతంగా సమాచారం అందించేందుకు ఈపీఎఫ్ఓ కూడా అధికారికంగా వాట్సప్ ఛానెల్ అందుబాటులోకి తెచ్చింది.

వాట్సప్ ఛానెల్‌లో ఎలా చేరాలి..?

-మీ ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి

-మెయిన్ స్క్రీన్‌లో దిగువున అప్డేట్ అని కనిపించే ఆప్షన్ ఎంచుకోండి

-అనంతరం పైన సెర్చ్ బార్‌లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి

-ఈపీఎఫ్‌వో పేరుతో గ్రీన్ టిక్‌తో వాట్సప్ ఛానెల్ కనిపిస్తుంది

-ఫాలో బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది

ఈ లింక్ ద్వారా చేరవచ్చు..

ఈపీఎఫ్ఓ తన ఎక్స్ ఖాతాలో ఒక లింక్ పొందుపర్చింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా వాట్సప్ ఛానెల్‌లో చేరవచ్చు. అలాగే ఈపీఎఫ్ఓ ఒక క్యూఆర్ కోడ్ కూడా ఎక్స్ ఖాతాలో అందుబాటులో ఉంచింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా వాట్సప్ ఛానెల్‌లో చేరవచ్చు.

వాట్సప్ ఛానెల్‌లో ఏయే సమాచారం పొందవచ్చు..?

ఈపీఎఫ్ఓ తీసుకునే నిర్ణయాలు, నిబంధనల్లో మార్పులు, పీఎఫ్ క్లెయిమ్స్, నామినేషన్ దాఖలు, యూఏఎన్ యాక్టివేషన్‌కు సంబంధించిన సమాచారం పొందవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ప్రాసెస్ ఎలా అనేది వివరిస్తారు. వీటిని చూడటం ద్వారా మీరే స్వయంగా క్లెయిమ్స్ దాఖలు, యూఏఎన్ యాక్టివేషన్ లాంటివి చేసుకోవచ్చు. ఇక సైబర్ మోసాల బారిన పడకుండా సలహాలు, అలర్ట్స్ కూడా వాట్సప్ ఛానెల్ ద్వారా పొందవచ్చు.  కాగా కేంద్రం ఇటీవల ఈపీఎఫ్‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ శాలరీ సీలింగ్ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీని వల్ల 51 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. ఇందుకోసం కేంద్రం బడ్జెట్ కూడా కేటాయించింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *