Headlines

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?


విశాఖపట్నం నగరంలో రోడ్డుపక్కన కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన సెంట్రల్ పార్కు ఎదురుగా పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని స్థానిక వాకర్స్ గుర్తించారు. రోడ్డు పక్కన ఇలా కరెన్సీ నోట్లు పడి ఉండటంతో స్థానికుల్లో తీవ్రమైన ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నాయి. పడి ఉన్న నోట్లలో 500, 100, 50, 20 మరియు 10 రూపాయల నోట్లు ఉండటం విశేషం. అయితే, ఇవన్నీ చినిగిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ విచిత్ర ఘటనను గమనించిన వాకర్స్ వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేవలం కరెన్సీ నోట్లే కాకుండా, అక్కడ ఎల్ఐసి (LIC) రసీదులు, ఒక మహిళకు చెందిన పాన్ కార్డును కూడా పోలీసులు గుర్తించారు. ఆ కరెన్సీ నోట్లు అక్కడకు ఎలా వచ్చాయి? ఎవరైనా కావాలని పడేశారా? లేక దీని వెనుక ఏదైనా మోసం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

మరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పులసలకు మించి క్రేజ్‌.. ఈ రొయ్యల సొంతం!

3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు నిజమేంటి?

జలపాతం వద్ద షాకింగ్ సీన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *