Headlines

ఎల్పీజీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్‌


గ్యాస్ సిలిండర్ కొత్త రూల్స్ 2026 గురించి వినియోగదారులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలను చూద్దాం. మీరు ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ లేదా భారత్ గ్యాస్ కనెక్షన్ వాడుతున్నారా? అయితే మీకోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్. ప్రతి నెలా లేదంటే.. రెండు నెలలకోసారి ఇంట్లో అత్యంత ముఖ్యమైన పని.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం. అయితే, ఇటీవల కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ, ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి సంస్థలు సిలిండర్ రీఫిల్, బుకింగ్‌కు సంబంధించి కొన్ని కీలక నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అవేంటో, ఇంట్లో కూర్చునే తేలిగ్గా ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొత్త నిబంధనల విషయానికి వస్తే… మొదటిది.. రీఫిల్ గ్యాప్ రూల్! గ్యాస్ సిలిండర్ల నిల్వ, అక్రమ రవాణాను అరికట్టేందుకు బుకింగ్ వ్యవధిపై ఆంక్షలు విధించారు. పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ మధ్య కనీసం 25 రోజుల గ్యాప్, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలి. రెండోది.. OTP / DAC సిస్టమ్! ఇప్పుడు సిలిండర్ డెలివరీ సమయంలో మీ ఫోన్‌కు వచ్చే 4 అంకెల ఓటీపీని డెలివరీ బాయ్‌కు చెబితేనే సిలిండర్ ఇస్తారు. కాబట్టి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవడం మర్చిపోవద్దు. మూడోది.. ఒక ఇంటికి ఒకటే కనెక్షన్! మీ ఇంటికి పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ ఉంటే, ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్‌ను 30 రోజుల్లోగా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు కనెక్షన్లు ఒకేసారి ఉంచుకోవడానికి కుదరదు. ఇక డిజిటల్ బుకింగ్ విధానాల విషయానికి వస్తే.. ఏజెన్సీలకు వెళ్లే అవసరం లేకుండా చాలా సులభంగా బుక్ చేయవచ్చు. ఇండేన్‌ గ్యాస్ వినియోగదారులు.. మీ వాట్సాప్ నుండి 75,88,88,88,24 నంబర్‌కు REFILL అని మెసేజ్ పంపవచ్చు, లేదా 77,18,95,55,55 నంబర్‌కు ఐవీఆర్‌ఎస్ ద్వారా కాల్ చేయవచ్చు. భారత్ గ్యాస్ వినియోగదారులు: వాట్సాప్‌లో 18,00,22,43,44 నంబర్‌కు Hi అని లేదా Book అని మెసేజ్ పంపితే సరిపోతుంది. హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు: మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుండి 92,22,20,11,22 కి వాట్సాప్ ద్వారా లేదా 94,93,60,22,22 కి మిస్డ్ కాల్ ఇచ్చి సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా PhonePe, Google Pay, Paytm, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా ఎల్పీజీ విభాగంలోకి వెళ్లి మీ వివరాలు ఎంటర్ చేసి నిమిషాల్లో బుకింగ్ పూర్తి చేయవచ్చు. చూశారుగా! ఈ కొత్త నియమాలను గుర్తుంచుకుని, క్యూ లైన్లలో నిలబడకుండా డిజిటల్ పద్ధతిలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI కొత్త నిబంధనలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి అమలు

AIకి చెక్‌ పెట్టకపోతే ముప్పు తప్పదన్న నిపుణులు.. ట్రాష్ అంటూ కొట్టిపారేసిన ట్రంప్‌

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

పులసలకు మించి క్రేజ్‌.. ఈ రొయ్యల సొంతం!

3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *