Headlines

Bigg Boss 10 Telugu : అడియన్స్ అనుకున్నదే జరిగింది.. బిగ్ బాస్‏లో డబుల్ ఎలిమినేషన్.. దక్షితోపాటు ఆమె కూడా అవుట్..


Bigg Boss 10 Telugu : అడియన్స్ అనుకున్నదే జరిగింది.. బిగ్ బాస్‏లో డబుల్ ఎలిమినేషన్.. దక్షితోపాటు ఆమె కూడా అవుట్..

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతోంది. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతీ వారం ఊహించని మలుపులు, ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కాగా, 7వ వారానికి సంబంధించి బిగ్‌బాస్ హౌస్‌లో అత్యంత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ వారం ఏకంగా ‘డబుల్ ఎలిమినేషన్’ జరిగి నలుగురికీ పెద్ద షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ వారం నామినేట్ అయినవారిలో త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, రామకృష్ణ, శ్వేత, టెంపర్ వంశీ, దక్షి, శివకుమార్, నీతూ నటరాజ్ అయ్యారు. ఈ వారం జరిగిన ఓటింగ్‌లో రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణ అత్యధిక ఓటింగ్‌ను సాధించి సేఫ్ జోన్‌లో నిలిచారు. అయితే చివరి స్థానాల్లో నీతూ నటరాజ్, శివకుమార్, దక్షి గుత్తికొండ నిలవడంతో ఎలిమినేషన్ కత్తి వారిపైనే వేలాడింది.

ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

అయితే ఇప్పటికే దక్షి ఎలిమినేట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం మరో ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే అడియన్స్ ఓటింగ్ కాదు.. ఈసారి హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం కంటెస్టెంట్ బయటకు రానున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై, వారి ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్‌ల ప్రవర్తనతో పాటు షాలిని వ్యవహరించిన తీరుపై నాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ దశలో నాగార్జున హెచ్చరించిన తీరుతో షాలిని హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పడం, దానికి నాగ్ గేట్లు ఓపెన్ చేయమని ఆదేశించడం ఎప్పుడూ జరిగే రోటిన్ సీన్ చూపించి మళ్లీ యధావిధిగా గేట్స్ క్లోజ్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఓటింగ్ కాకుండా .. హౌస్ లో ఉండటానికి సరైన అర్హత లేని సభ్యులకు ఓటింగ్ వేయాలని చెప్పారట నాగార్జున. దీంతో ఎల్లో టీమ్ పూర్తిగా షాలిని ఇంట్లో ఉండటానికి అర్హురాలు కాదంటూ ఓటింగ్ వేయడంతో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా దక్షి, షాలిని ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..

షాలిని ఎలిమినేటెడ్..

 

View this post on Instagram

 

A post shared by Shalini Damera🦋 (@shaliniii_patell)

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *