Cooking Oil: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!

Cooking Oil: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!


Cooking Oil: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!

లీటర్‌ పామాయిల్‌ ప్యాకెట్‌ రిటైల్‌గా రూ.127కి చేరింది. ఫ్రీడమ్‌ సన్‌ప్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌ రూ.174, వేరుశనగ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.180లకు అమ్ముతున్నారు. రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే ప్యాకెట్‌కు15-20 రూపాయలు పెరిగిపోయింది. ఇక 15 లీటర్ల ఫ్రీడమ్‌ ఆయిల్‌ డబ్బా గతంలో రూ.2450 ఉంటే ఇప్పుడు రూ.2600కు విక్రయిస్తున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ఆయిల్ రేట్లు అందనంత దూరానికి వెళ్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు.

ప్రపంచంలోనే వంటనూనెల దిగుమతిలో భారత్‌ అగ్రగామిగా ఉంది. అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి సోయానూనె.. రష్యా, ఉక్రెయిన్‌ నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ పెద్ద మొత్తంలో భారత్‌కు వస్తోంది. ఇండోనేషియా, థాయిలాండ్‌, మలేషియాల నుంచి పామాయిల్‌ కొంటున్నాం. అయితే సాధారణంగా అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి భారత్‌కు సముద్ర మార్గం ద్వారా వంటనూనెల దిగుమతులు రావాలంటే 6 వారాలపైనే పడుతుంది. రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి నల్ల సముద్రం మీదుగా సరుకు చేరాలంటే 3-4 వారాల సమయం తీసుకుంటుంది.

ఇక ఆసియా దేశాల నుంచే పామాయిల్‌ దిగుమతులు అవుతున్నా కూడా ఇంచుమించుగా వారం సమయం పడుతోంది. కానీ గల్ఫ్‌ దేశాలు అగ్ని గుండంలా మారడంతో ఈ వంటనూనెల దిగుమతి ఆలస్యమవుతున్నదిప్పుడు. అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలే లక్ష్యంగా ఇరాన్‌ బాంబుల వర్షం కురిపిస్తుండటం.. హర్మూజ్‌ జలసంధిని కూడా మూసేయడంతో ఆయిల్ రవాణా ఆగిపోయింది. ఫలితంగా రేట్లు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్‌ సిలిండర్లు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడుడుతున్నాయి. కుకింగ్ ఆయిల్ దిగుమతులు కూడా తగ్గాయి. దీంతో రోజురోజుకు ఆందోళన ఎక్కువవుతోంది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *