లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి?..
ధంతేరస్ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచి, సాయంత్రం వేళ దీపాలు వెలిగించి లక్ష్మీదేవి, కుబేరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా ఈ రోజున షాపింగ్ చేసేటప్పుడు సంప్రదాయాలను గుర్తుంచుకోవాలి. అయితే పైన పేర్కొన్నవి మతపరమైన, సంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. వీటిని పాటించడం పూర్తిగా వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు మతపరమైన నమ్మకాలు, సంప్రదాయాలు, వాస్తు విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని పాటించడం పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం, అభీష్టం మాత్రమే.)