ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్ అకౌంట్లో మూడేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు చేయకపోతే అకౌంట్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్‌గా పరిగణిస్తుంది. మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిట్యూషన్ జమ కాకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయినా మీ పీఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్ నేరుగా అకౌంట్లోకి రానుంది.
ఇనాక్టివ్ అయిన పీఎఫ్ అకౌంట్లలోని నగదును నేరుగా ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. దీంతో ఎలాంటి క్లెయిమ్ చేయకపోయినా నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇందుకోసం ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఈపీఎఫ్‌వో అమలు చేస్తోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేసేందుకు సిద్దమైంది.
అయితే ఆటో సెటిల్మెంట్ విధానంలో డైరెక్ట్‌గా డబ్బులు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. మీ ఆధార్‌తో పీఎఫ్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇక కేవైసీ వివరాలు పూర్తి చేసి ఉండాలి. పీఎఫ్ ఖాతాతో బ్యాంక్ అకౌంట్ అనుసంధానించబడి ఉండాలి. మీరు ఈ పనులన్నీ చేసి ఉంటే మీరు క్లెయిమ్ చేయకోయినా నిధులు జమ అవుతాయి.
ఇనాక్టివ్ ఖాతాల్లో రూ.వెయ్యిలోపు ఉన్న అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్‌ను ఆటోమేటిక్‌గా చందాదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద మొత్తాలను కూడా దీనిని విస్తరిస్తున్నారు. ఇక పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మ్యాచ్ అవ్వకపోవడం, ఆధార్ వివరాలు తప్పుగా ఉండటం, ఒక ఉద్యోగి రెండు యూఏఎన్ నెంబర్లు కలిగి ఉండటం, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయపోవడం, యజమాని ఎగ్జిట్ డేట్‌ను సరిగ్గా గుర్తించకపోవడం వల్ల నిధులు నిలిచిపోతాయి.
మీ అకౌంట్ ఇనాక్టివ్‌గా ఉండకుండా ఉండాలంటే ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్‌ను బదిలీ చేసుకోండి. మీ యూఏఎన్ అన్ని ఉద్యోగాలకు అనుసంధానించబడి ఉందో లేదో చెక్ చేయండి. ఆధార్, బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోండి. కేవైసీ స్థితి క్రమం తప్పకంగా చూసుకోండి




