Headlines

Firecracker Insurance: దీపావళి.. పటాకుల ప్రమాదాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? క్లెయిమ్ విధానం ఏంటి?


Firecracker Accident Insurance: దీపావళి భారతదేశం అంతటా అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ, నిని కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. దీపావళి పండుగ అంటే కేవలం టపాసులు కాల్చడం, కొత్త బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు. ఇందులో ఆనందంతో పాటు అంతే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో టపాసులు పేలడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల వల్ల మీకు గాయాలు కావచ్చు. అలాగే వైద్య చికిత్స కూడా అవసరం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టపాసుల ప్రమాదాలకు బీమా వర్తిస్తుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బాణసంచా ప్రమాదాలకు బీమా సౌకర్యం ఉందా?

చాలా మంది బాణసంచా సంబంధిత ప్రమాదాలకు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చని అనుకుంటారు. అయితే, అది నిజం కాదు. మీరు తీసుకున్న బీమా రకాన్ని బట్టి, మీకు ఏ రకమైన సమస్యలు, ప్రమాదాలకు కవరేజ్ లభిస్తుందో నిర్ణయించవచ్చు.

స్వల్పకాలిక బాణసంచా బీమా పథకాలు:

అందుకే స్వల్పకాలిక పటాకుల బీమా పథకాలు ఉన్నాయి. దీనికోసం సాధారణ ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పథకాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. పటాకుల ప్రమాదాల వల్ల కలిగే నష్టాలకు మీరు గృహ బీమా ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి పథకం విభిన్న రకాల కవరేజీని, ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి



బాణసంచా వల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రథమ చికిత్స పొందిన తర్వాత బీమా సంస్థకు తెలియజేయాలి. ప్రమాదాలకు వైద్య బీమా పొందడానికి, వినియోగదారులు క్లెయిమ్ ఫారం, పాలసీ వివరాలు, ఆసుపత్రి అడ్మిషన్ లెటర్, డిశ్చార్జ్ పత్రాలను సమర్పించవలసి ఉంటుందని గమనించడం ముఖ్యం.

ఇది కూడా చదవండి: RBI Notes: దీపావళికి రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? ఆర్బీఐ సంచలన ప్రకటన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *