IND vs PAK: భారత్, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..? అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం..!

IND vs PAK: భారత్, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్..? అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం..!


India vs Pakistan Test series: ప్రస్తుత దేశవాళీ లీగ్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ఈ నెల 30, 31 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఐసీసీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికంటే ముందుగా, ఈ నెల 21వ తేదీన ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల కమిటీ వర్చువల్ పద్ధతిలో భేటీ కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ భవిష్యత్తును మార్చేలా ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడి పర్యటనపై సస్పెన్స్..

రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ భారత్‌కు స్వయంగా వస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ప్రయాణ ప్రణాళికలు ఖరారు కాకపోవడంతో, ఆయన ఈ సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: IPL 2026: హార్దిక్ పాండ్య కోసం రంగంలోకి 5 జట్లు.. మెగా వేలంలో కోట్ల వర్షం కురిపించేందుకు రెడీ..!

ఇవి కూడా చదవండి

పన్నెండు జట్లతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్?

టెస్ట్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు మాజీ న్యూజిలాండ్ ఆటగాడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రస్తుతం తొమ్మిది జట్లతో సాగుతున్న ఈ టోర్నమెంట్‌ను పన్నెండు జట్లకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు కూడా భవిష్యత్తులో ఆడే అవకాశం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్‌కు భారత జట్టు.. ఛోటా ప్యాకెట్ రీఎంట్రీ ఫిక్స్..!

పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడేనా?

ఈ కొత్త ప్రణాళిక అమల్లోకి వస్తే, భవిష్యత్తు పర్యటనల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు టెస్ట్ సిరీస్‌లో తలపడే అవకాశం ఉంటుంది. గతంలో 2007-08 సీజన్‌లో పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు చివరిసారిగా ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ తర్వాత సరిహద్దు వివాదాల వల్ల గత పద్దెనిమిదేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టెస్ట్ మ్యాచ్‌లు జరగలేదు. ఇటీవల బంగ్లాదేశ్ బోర్డుతో జరిగిన సమావేశంలో మోహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ, భవిష్యత్తులో భారత్‌తో సహా అన్ని దేశాలతో టెస్టులు ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: IPL 2026: రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే.. మా టీంలో మెంటలోడిని తట్టుకోలేరంతే..!

ఒక్క మ్యాచ్ టెస్ట్ సిరీస్ ప్రతిపాదన..

ఆర్థికంగా వెనుకబడిన చిన్న క్రికెట్ బోర్డుల ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు వీలుగా ఒకే ఒక్క మ్యాచ్‌తో కూడిన టెస్ట్ సిరీస్‌లను నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది. ప్రస్తుతం కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలనే నిబంధన ఉంది. అయితే, ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘమైన సిరీస్‌లు మాత్రమే ఆటగాళ్ల అసలైన ప్రతిభను నిరూపిస్తాయని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై అహ్మదాబాద్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *