Inter Admissions 2026: ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Inter Admissions 2026: ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Inter Admissions 2026: ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయ సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్‌జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం MPC, BPC, MEC గ్రూపులలో ప్రవేశం కల్పిస్తారు. 2026 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

బాలుర, బాలికల గురుకులాలతోపాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌ 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధులు దరఖాస్తు సమయంలో రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇక TGRJC CET-2026 ప్రవేశ పరీక్ష మే 3, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఒకే సెషన్‌లో నిర్వహిస్తారు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. లేదా 040-24734899 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చునని సంస్థ కార్యదర్శి తెలిపారు.

తెలంగాణ ఆర్‌జేసీ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *