Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఎమోషనల్

Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్  ఎమోషనల్


Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్  ఎమోషనల్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో హైపర్ ఆది ఒకడు. మొదట సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన పంచులు, ప్రాసలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు బాగా గుర్తింపు తెచ్చిన బుల్లితెరను మాత్రం వదిలేయలేదు. జబర్దస్త్ లో చేయకున్నా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఉన్న ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో హైపర్ ఆది కూడా ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో బిజీ బిజీగా ఉంటోన్న ఈ స్టార్ కమెడియన్ పెళ్లి గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు. అయితే తాజాగా తన పెళ్లిపై ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రతి ఆదివారం ప్రసారమవుతోన్న ఓ టీవీ షోలో బ్రదర్స్ డే సందర్భంగా ఓ స్కిట్ చేశారు. అందులో కౌశిక్, బాలాదిత్యలు చేసిన స్కిట్ అందరినీ కంటతడి పెట్టించింది. మా ఆయన జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నావా అని కౌశిక్ భార్య.. బాలాదిత్యను నిలదీస్తుంది. అదేమీ లేదు వదినా.. నేను దొంగతనం చేయడం లేదు.. ఏదో కొంచెం అవసరమని డబ్బు తీసుకున్నానంటాడు బాలా దిత్య. అదంతా ఒకప్పుడు.. ఆ డబ్బులు అక్కడ పెట్టు అని వదిన గద్దిస్తుంది. దీంతో నా వల్ల మీకు, వదినకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే నేను మీ మధ్య ఉండకూడదు, అందుకే వెళ్లిపోతున్నానని లెటర్ రాసి వెళ్లిపోతాడు బాలాదిత్య. దీంతో తమ్ముడిని తలచుకుని బాధపడుతూ మంచం పడతాడు కార్తీక్. దీంతో బాలాదిత్య అన్నయ్యా.. లే అన్నయ్యా! అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఈ స్కిట్ అందరినీ కంటతడి పెట్టించింది. ఇదే సందర్భంగా మైక్ అందుకున్న హైపర్ ఆది.. ‘పెళ్లి చేసుకుంటే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయనే పాయింట్ నిజమైతే మాత్రం.. అలాంటి పెళ్లి కూడా చేసుకోవడానికి నేను ఏ మాత్రం ఇష్టపడను. నాకు మా అన్నయ్యలంటే అంత ఇష్టం’ అని ఆది చెబుతాడు. దీంతో అక్కడున్న వారంతా ఆదిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. ప్రస్తుతం హైపర్ ఆది కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హైపర్ ఆది లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Hyper Aadi (@hyper.aadi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *