డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునే డైట్ ప్రియులకు ఈ జొన్న సూప్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: రెండు టీస్పూన్ల జొన్న పిండి, ఒక టీస్పూన్నూ నె లేదా నెయ్యి, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, రెండేసి టేబుల్ స్పూన్ల టమాటా ముక్కలు, కరివేపాకు, సుమారు అర లీటర్ నీళ్లు, ఉప్పు, తాజాగా దంచిన అర టీస్పూన్ మిరియాల పొడి, తాజా కొత్తిమీర, తగినంత నిమ్మరసం.