నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా అరంగేట్రంపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఏవో అడ్డంకులు.. అవాంతరాలు.. అయితే ఎట్టకేలకు మోక్షజ్ఞ మొదటి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘బింబిసార’, ‘విశ్వంభర’ చిత్రాల దర్శకుడు వశిష్ఠ బాలయ్య కుమారుడిని హీరోగా లాంఛ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్, పునర్జన్మల నేపథ్యంతో రీ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో మోక్షజ్ఞ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఇక తన మొదటి సినిమా కోసం మోక్షజ్ఞ కూడా మంచి మేకోవర్‌తో హ్యాండ్సమ్గా మారిపోయాడు. ఇప్పుడీ క్రేజీ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. మోక్షజ్ఞ మొదటి సినిమాలో హీరోయిన్ గా టాప్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ను తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు శ్రీలీల ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది.
కాగా శ్రీలీల స్థానంలో మోక్షజ్ఞ మొదటి సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవలే తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించింది. జై కృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ లో రాషా హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ యాక్టింగ్, గ్లామర్ పరంగా రాషాకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్న రాషా ఇప్పుడు మోక్షజ్ఞ తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. రాషా తడాని తల్లి రవీనా టాండన్ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బాలయ్యతో కలిసి ఆమె నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వీరి వారసులు కలిసి నటించనున్నారన్న వార్త మరింత ఆసక్తికరంగా మారింది. మోక్షజ్ఞ- రాషా తడానీ జడి వెండితెరపై చూడముచ్చటగా ఉంటుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
రాషా తడానీ లేటెస్ట్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి