Niharika: నేను చేసే ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను.. ‘రాకాస’ సక్సెస్ మీట్‌లో నిహారిక కొణిదెల

Niharika: నేను చేసే ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను.. ‘రాకాస’ సక్సెస్ మీట్‌లో నిహారిక కొణిదెల


Niharika: నేను చేసే ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను.. ‘రాకాస’ సక్సెస్ మీట్‌లో నిహారిక కొణిదెల

మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ ఈవెంట్ లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్‌కి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలని ఉంది. కానీ అది అసాధ్యం. మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మీదున్న నమ్మకంతో ‘రాకాస’ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ‘ఉప్పెన’ టైంలో మైత్రి రవి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు ఈ ఇండస్ట్రీలో పెద్ద గైడెన్స్ ఇస్తారు. స్ట్రైక్ టైంలో సపోర్ట్ చేసిన సుప్రియ అక్క, స్వప్న అక్కలకు థాంక్స్. సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని ఎంతో ఆదరిస్తున్నారు. నా టీం సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఏ ఒక్కరూ కూడా ప్రమోషన్స్ విషయంలో కండీషన్స్ పెట్టలేదు. సంగీత్, నయన్, గెటప్ శ్రీను అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బిగ్గెస్ట్ పిల్లర్‌గా రమేష్ గారు మాకు అండగా నిలిచారు. మా మూవీకి మీడియా నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో నేటి నుంచి ‘రాకాస’ని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. అందరూ ‘రాకాస’ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

మైత్రి రవి మాట్లాడుతూ .. ‘నిహారిక గారు ‘రాకాస’ని అద్భుతంగా ప్రమోట్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ కొట్టాం. మున్ముందు ఆమె చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో కూల్ బ్రీత్‌లా ఉండే చిత్రమిది. ఆద్యంతం నవ్వించారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ‘రాకాస’లో పార్ట్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. థియేటర్‌కు వెళ్లి హ్యాపీగా నవ్వుకుని, ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ ఉంది. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘ముందు నుంచీ నాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. మా కోసం వచ్చిన మైత్రి రవి గారికి థాంక్స్. సినిమా మీద పిచ్చి, ప్రేమతో డిస్ట్రిబ్యూటర్లు చిత్రాల్ని కొంటారు. మూవీ రిజల్ట్ వల్ల డిస్ట్రిబ్యూటర్లే మొదటగా ఎఫెక్ట్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే సినిమా హిట్టైనట్టు. ‘రాకాస’ని నమ్మి తీసుకున్న ప్రతీ ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కు థాంక్స్. రెండో వారంలోనూ ‘రాకాస’కి మంచి స్క్రీన్లు ఉన్నాయి. అదే మా సినిమా విజయానికి నిదర్శనం. థియేటర్ విజిట్స్‌కి వెళ్లినప్పుడు ఆడియెన్స్ రియాక్షన్స్ చూసి ఎంతో ఆనందమేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిహారిక గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత వరకు వచ్చేది కాదు. బ్రహ్మాజీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ లాంటి టీంని నేను ఇంత వరకు చూడలేదు. ఎంతో ప్యాషనేట్‌తో వీరంతా పని చేశారు. డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఇలా స్టేజ్ మీద కనిపించడం ఈ మధ్య కాలంలో ఎక్కడా జరగలేదు. సంగీత్, నయన్ సారిక, నిహారిక, మానస శర్మ, గెటప్ శ్రీను పబ్లిసిటీ కోసం చాలా కష్టపడ్డారు. జనాలు ఈ మధ్య ఎక్కువగా థియేటర్‌కు రావడం లేదు. కానీ వీరంతా కూడా చేసిన ప్రమోషన్స్‌తో ఆడియెన్స్ థియేటర్ల వరకు వచ్చి, సినిమాని చూసి, ఇంత పెద్ద హిట్ చేశారు. ఇంకా మూవీని చూడని వాళ్లంతా వెంటనే చూడండి’ అని అన్నారు.

మానస శర్మ మాట్లాడుతూ .. ‘మా ‘రాకాస’ మూవీని డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి జనాల వరకు రీచ్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నా డ్రీమ్‌ని, నా కథను ఇంత వరకు తీసుకు వచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్,నా టీంకు థాంక్స్’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కోసం సుబ్బా రెడ్డి గారు ముందడుగు వేశారు. ఆయన వచ్చిన తరువాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు. ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి ‘రాకాస’ని ఇచ్చాం. జనాల వరకు డిస్ట్రిబ్యూటర్లే సినిమాని తీసుకెళ్తారు. సంక్రాంతి సీజన్‌లోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా వస్తుంటారు. కానీ సమ్మర్‌లోనూ ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ఉన్నా కూడా ‘రాకాస’కి మంచి వసూళ్లు వచ్చాయి. మాకు ప్రమోషన్స్‌లో సపోర్ట్ చేసిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ సన్నీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత ‘రాకాస’ని మాకు ఇచ్చిన నిహారిక గారికి థాంక్స్’ అని అన్నారు. లాస్య ఫిల్మ్స్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని మాకు ఇచ్చిన నిహారిక గారు, రమేష్ గారు, సుబ్బారెడ్డి గారికి థాంక్స్. అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమాకి వస్తున్నారు. ఫ్యామిలీ, యూత్ ఇలా అందరూ థియేటర్లకు వస్తున్నారు’ అని అన్నారు. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ .. ‘సంక్రాంతి సీజన్ తరువాత మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్ ‘రాకాస’కే వచ్చారు. ఈ మూవీని మాకు ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమా మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్ పాండు మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కృష్ణా జిల్లాలో అద్భుతంగా ఆడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ రిపీటెడ్‌గా సినిమాకి వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ రెండో వారంలోనూ ఎక్కువ స్క్రీన్లలో ఆడుతోంది. ఈ మధ్య కాలంలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. ‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత మళ్లీ మాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, టీంకు థాంక్స్’ అని అన్నారు.

 



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *