Headlines

OTT Movie: 25 కోట్లతో తీస్తే 300 కోట్ల కలెక్షన్లు.. అప్పుడే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?


ఇటీవల కొన్ని సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయాలు సాధిస్తున్నాయి. పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సులు, స్పెషల్ సాంగ్స్, వీఎఫ్ ఎక్స్ హంగులు లేనప్పటికీ కేవలం కంటెంట్ తో కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపిస్తున్నాయి. నివిన్ పాలి, మమితా బైజు హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. కొద్ది రోజుల క్రితమే మలయాళంలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. థియేటర్లలో ఈ సినిమా రిలీజై నెల రోజులు సమీపిస్తున్నా కలెక్షన్ల హీరో ఆగడం లేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా అదే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తోన్నఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాతే సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావాలని ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సెప్టెంబర్ ఆఖరి వారం లేదా అక్టోబర్ ఫస్ట్ వీ‌క్‌లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇక ‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా విషయానికి వస్తే.. నివిన్ పౌలీ, మమితా బైజుతో పాటు సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తదితరులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో పెద్ద చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడం విశేషం.

‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా ట్రైలర్ తెలుగులో..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *