Headlines

దేశ చరిత్రలో తొలిసారి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతానికి ముందే ‘వందేమాతరం ఆలాపన!

బ్రిటీష్ పాలన నుంచి భారత్ విముక్తి పొంది అక్షరాల ఎనిమిది పదుల సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశమంతా నేడు దేశభక్తి ఉత్సాహాల నడుమ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోంటోంది. ఇప్పటికే ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపైనుంచి మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ఏడాది వేడుకల ప్రత్యేకతలు వందేమాతర ఆలపన: నేడు చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం…

Read More

50 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఐకూ ఇయర్‌‌బడ్స్‌.. ధర తెలిస్తే నిజంగానే పిచ్చెక్కిపోద్ది

భారత మార్కెట్లో తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని ఐక్యూ (iQOO) మరింత పెంచుకునే విధానంలో భాగంగా.. iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త iQOO బడ్స్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ (TWS)ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే మెరుగైన సౌండ్, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్, మొబైల్ గేమింగ్ కోసం అల్ట్రా-లో లేటెన్సీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. మొబైల్ గేమింగ్ ప్రియులను, మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఐకూ సంస్థ సరికొత్త బడ్జెట్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి…

Read More

కేతు సంచారం.. వీరికి తల రాత మారడం ఖాయం

సెప్టెంబర్ మొదటి 15 రోజుల్లో కేతు ధనయోగం ఏర్పడనున్నదంట. కేతు సంచారం వలన ఈ 15 రోజులు మూడు రాశల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వ్యాపారంలో పురోగతి, అన్నివిధాలుగా వీరికి చాలా ప్రయోజనాలు చేకూర్చున్నదంట. కాగా, ఇప్పుడు మనం సెప్టెంబర్‌ నెలలో తమ తల రాతను మార్చుకునే రాశులు ఏవో చూసేద్దాం.

Read More

Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

తెలుగు చలన చిత్ర సంగీత సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగానే చక్రవర్తిలానే ఓ వెలుగు వెలిగారు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు శాసించారు. అగ్ర హీరోల దగ్గర నుంచి వర్ధమాన నటీనటుల వరకు అందరికీ చక్రవర్తి సంగీతమే ఊపిరిగా ఉండేది. ఆయన పాలనలో పాటలు ఊగాయి, పరుగులెత్తాయి, ఉరకలు వేశాయి. దాదాపు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తన బాణీలతో దశాబ్దం పైగా ఆంధ్ర దేశాన్ని అలరించారు…

Read More

Avika Gor: అవికా గోర్ ఆ సీన్ చేయనంటే చేయనంది.. దాంతో కథనే మార్చేశాం

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, ముఖ్యంగా కొన్ని సినిమాల నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మేము వయసుకు వచ్చాం చిత్ర ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించినప్పుడు నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు సినిమాను చూసి ఎంతగానో ఆకట్టుకున్నారని తెలిపారు. “ఇలాంటి సినిమా మాకు వస్తుందా?” అని వారు అడిగారని, అది సినిమా విజయాన్ని ముందే సూచించిందని బెక్కం వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు. తనీష్…

Read More

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు స్పెషల్.. నాగబాబు ఏం చేశారో చూశారా? వీడియో

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా…

Read More

Fact Check: పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? అసలు నిజం ఏంటో తెలిస్తే..

పుదీనా-దాల్చినచెక్క టీ తాగడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పరిశీలిస్తే.. దాల్చినచెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, ఈ టీ డయాబెటిస్‌కు దాల్చినచెక్క, పుదీనాల ప్రభావం ఎంత? దాల్చినచెక్కలో సిన్నమాల్డిహైడ్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దాల్చినచెక్క ఇన్సులిన్ తరహాలో పనిచేసి,…

Read More

పొరుగు దేశం కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ .. దుమారం రేపుతున్న.. పంజాబ్‌ సీఎం మరియం వ్యాఖ్యలు

సాధారణంగా పాకిస్థాన్ నాయకులు తమ దేశంలో జరిగే హింసకు భారత్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలపై నిందలు మోపుతుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా మరియం నవాజ్ స్వయంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే తమకు అంతర్గత భద్రతా ముప్పు పొంచి ఉందని అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. శనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే పక్క రాష్ట్రాల…

Read More

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఆడుకున్న సరదా ప్రాంక్ అతడిని నేరుగా కటకటాల వెనక్కి నెట్టింది. ప్రియురాలికి చేసిన ఒకే ఒక్క అబద్ధపు మెసేజ్.. అక్రమంగా కోట్లు సంపాదిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గ్రూప్ గుట్టు రట్టు చేసింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవినేని సుమంత్ బెంగళూరులో ఉంటూ టెలిగ్రామ్ వేదికగా క్రికెట్ బెట్టింగ్ ప్రిడిక్షన్ గ్రూప్‌ను…

Read More

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..?

కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా…

Read More