Headlines

Duleep Trophy 2026: చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

Duleep Trophy 2026: దేశవాళీ క్రికెట్ సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు నేటి నుంచి టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ టైటిల్ ఫైట్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధానంగా కొన్ని ఆసక్తికర పోరులు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. సౌత్ జోన్ జట్టులో సీనియర్ పేసర్…

Read More

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!

బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, చాలామందికి టీ తయారు చేసేటప్పుడు పాలు విరిగిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లంలో ఉండే సహజ ఆమ్ల గుణం, పాలు మరిగే ఉష్ణోగ్రత కలవడం వల్ల పాలు విరుగుతాయి. సరైన పద్ధతి పాటిస్తే పాలు విరగకుండా అద్భుతమైన బెల్లం టీ తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన బెల్లం టీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే చిట్కాలు ఇవే! పాలు ఎందుకు విరుగుతాయి?: బెల్లంలో సహజంగానే కొంత ఆమ్లత్వం ఉంటుంది. మరిగే…

Read More

ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న భారం..

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు…

Read More

ఆ హీరోకి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ముందే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

తెలుగు సినిమా పరిశ్రమలో మాట నిలబెట్టుకోవడం, నిబద్ధతకు కట్టుబడి ఉండటం చాలా అరుదు. అలాంటి విశిష్టమైన లక్షణాలను ఉన్న వారిలో నిర్మాత ఎం.ఎస్. రాజు ఒకరు. వర్షం సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పారు. అలాగే ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకు స్టార్ డమ్ అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఎం.ఎస్. రాజుకు పరిశ్రమలోని టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,…

Read More

Women Asia Cup 2026: పాక్‎ను చిత్తు చేసిన శ్రీలంక.. ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

Women Asia Cup 2026: మహిళా ఆసియా కప్ టోర్నమెంట్‌లో రెండో సెమీఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను చావు దెబ్బ తీసి శ్రీలంక అద్భుత విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక జట్టు, వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 13) జరగనున్న తుది పోరులో టీమిండియాతో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత…

Read More

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్‌ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం…

Read More

Social Media: సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌ జాగ్రత్త..!

Social Media: నేటి ప్రజలకు ఇంటర్నెట్ ఒక వరం అన్నది నిజమే అయినప్పటికీ కొంతమంది ద్వేషపూరిత, దూషణాత్మక పోస్టులు పెట్టడం ద్వారా ప్రతికూల సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొన్నిసార్లు, అమాయక ప్రజలు కూడా తెలిసి తెలియక, సైబర్ నేరాలుగా పరిగణించే కార్యకలాపాలలో చిక్కుకుంటారు. కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని కూడా వ్యాప్తి చేస్తారు. ఇది ఇంటర్నెట్ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. పెరుగుతున్న సైబర్ నేరాల ఘటనలకు ప్రతిస్పందనగా, భారతదేశం 2000లో సమాచార సాంకేతిక…

Read More

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం!

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు…

Read More

చేపల కోసం వల విసిరాడు.. కాసుల వర్షం కురిసింది.. ఇంతకూ చిక్కింది ఏంటంటే

ఏలూరు: రిజర్వాయర్ నీటిలో రోజూలాగే ఆ మత్స్యకారుడు వల విసిరాడు.. కానీ ఈసారి నీటి అడుగు నుంచి వచ్చిన బలం జాలర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు కలిసి శ్రమించి ఒడ్డుకు లాగితే కనిపించింది ఒక అరుదైన భారీ మత్స్యం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ భారీ బొచ్చె చేప గురించే చర్చ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం, కొంగవారిగూడెం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయం (ఎర్రకాలువ…

Read More

CTET 2026: పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి వరకే ఛాన్స్!

CTET 2026 Exam Date: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, తాజాగా CTET 2026 దరఖాస్తు ఫారంలో మార్పులు చేసుకునేందుకు సవరణల విండోను CBSE తెరిచింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కూడా సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. అయితే CTET 2026 పరీక్ష…

Read More