Headlines

Indian Railways: పండుగలకు సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ!


Indian Railways Special Trains: పండుగల సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. దీంతో సాధారణ రైళ్లలో టికెట్లు లభించడం కష్టమవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే విడుదల చేసిన 2026 అక్టోబర్ 14వ తేదీ ప్రెస్ నోట్ ప్రకారం, అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8 గంటల సమయానికి ఉన్న బెర్తుల ఖాళీల వివరాలను వెల్లడించింది. అయితే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే కొద్దీ ఈ సంఖ్యల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఢిల్లీ వెళ్లే ప్రత్యేక రైళ్లలో బెర్తుల వివరాలు:

చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్లలో కొన్ని తేదీలకు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

ఢిల్లీ వైపు ప్రయాణించాలనుకునే వారు తమకు అనుకూలమైన తేదీల్లో బెర్తుల లభ్యతను పరిశీలించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

బిహార్ వెళ్లేవారికి కూడా అవకాశం:

బిహార్ వైపు ప్రయాణించే వారి కోసం చర్లపల్లి నుంచి దానాపూర్, ససారం ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

  • రైలు నంబర్ 07049: చర్లపల్లి – దానాపూర్ ప్రత్యేక రైలు. నవంబర్ 22వ తేదీన 206 బెర్తులు, నవంబర్ 29వ తేదీన 318 బెర్తులు ఖాళీగా ఉన్నట్లు ప్రెస్ నోట్ పేర్కొంది.
  • రైలు నంబర్ 07041: చర్లపల్లి – ససారం ప్రత్యేక రైలు. అక్టోబర్ 22వ తేదీన 535 బెర్తులు, నవంబర్ 19వ తేదీన 606 బెర్తులు, నవంబర్ 26వ తేదీన 720 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

బెంగళూరు వెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు

బెంగళూరు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

చర్లపల్లి – SMVT బెంగళూరు (రైలు నంబర్ 07065) ప్రత్యేక రైలులో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *