6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
అనంతపురం, ఆగస్ట్ 17: అనంతపురంలోని కల్యాణదుర్గం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్లపల్లి గ్రామంలో ఈ భారీ ఉమ్మడి కుటుంబం ఉంది. గ్రామంలో సుమారు 400 ఇళ్లు, 2,000 మంది జనాభా ఉండగా.. గ్రామంలోకి వెళ్లగానే కనిపించే పెద్ద ఇళ్లు ఈ కుటుంబానివే. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు పెద్ద ఇళ్లతో పాటు మరో ఇల్లు, పెద్ద ఖాళీ ప్రదేశం ఈ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. 83 మంది సభ్యులకు ఇవి కూడా సరిపోక…