Headlines

Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్


అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళ బురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంది. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. క్షితిజ్ జీవన్ రంధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్..

వినూత్న కాన్సెప్ట్‌, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *