దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ ప్రైవేట్ పెట్రోలియం ఉత్పత్తుల సంస్థ నయారా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచగా.. తాజాగా మరో ప్రైవేట్ సంస్థ కూడా వాహనదారులకు షాకిచ్చింది. ప్రైవేట్ కంపెనీ అయిన షెల్ ఇండియా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ధరలను అమల్లోకి తెచ్చింది.
షెల్ కంపెనీ బెంగళూరులో పెట్రోల్ ధరలను లీటర్‌పై రూ.7.41 పెంచింది. దీంతో సాధారణ పెట్రోల్ ధర రూ.119.85కి చేరుకోగా.. పవర్ పెట్రోల్ రూ.129.85 వద్ద కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర ఏకంగా రూ.25.01 పెంచింది. దీంతో సాధారణ డీజిల్ రూ.123.52, ప్రీమియం ధర రూ.133.52కి అందుబాటులో ఉంది.
ఇక మార్చి 22న నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ రేట్లను ఒకేసారి పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. దేశంలో మొత్తం 1,02,075 పెట్రోల్ బంక్‌లు ఉండగా.. నయారా సంస్థ 6,967 బంక్‌లను నిర్వహిస్తోంది. ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ సంస్ధగా అది ఉంది. దీంతో వాహనదారులపై భారం పడినట్లు అయింది.
ఇక ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్ సంస్థలు అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ధరలను పెంచేదే లేదని ఇప్పటికి ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ సంస్థల ధరలపై నియంత్రణ విధించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. అందుకే ప్రైవేట్ సంస్థలు పెంచుతున్నాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగతున్నాయి. బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పలుకుతోంది. దీని వల్ల ఇంధన రిటైలర్ సంస్థలు సమతమవుతున్నాయి. దీని వల్ల ధరలను పెంచాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. అటు ఏటీఎఫ్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అటు కమర్షియల్ సిలిండర్ ధరలు మరోసారి ఏప్రిల్ 1న పెరిగాయి.




