Headlines

Pillow Therapy: బ్రేకప్ అయినా, భరించలేని బాధైనా.. ఒక్క దిండు ఉంటే చాలు!


పని ఒత్తిడి, ఆర్థిక కష్టాలు, ఫ్యామిలీ టెన్షన్, ఒంటరితనం.. ఈ రోజుల్లో జలనాలను మానసికంగా కుంగదీస్తున్న అతి పెద్ద సమస్యలు. ఇవి బయటకు కనిపించకుండా లోపనే మనిషని నాశనం చేస్తుంటాయి. దీనిని నుంచి బయటపడేందుకు ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేక నిరాశపడుతుంటారు. అలాంటి వారికి మాట్లాడలేని ఒక చిన్న నేస్తం వారికి ఎనలేని ప్రశాంతతను ఇస్తుందట. అవును అదేదో కాదు.. మీరు పడుకునేప్పుడు మీ పక్కనే ఉండే పిల్లో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పిల్లో థెరఫీనే కనిపిస్తోంది.

పిల్లో థెరపీ అంటే ఏమిటి?

పిల్లో థెరపీ.. అంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు.. ఈ కాన్సెప్ట్ చాలా సులభం. జస్ట్ మీరు ఒక మెత్తటి దిండును తీసుకొని, దాన్ని గట్టిగా హత్తుకోవాలి. కావాలనుకుంటే దానిపై గట్టిగా అరవవచ్చు, ఏడవవచ్చు లేదా మనసులోని బాధను, ఆలోచనలను ఆ దిండుతో పంచుకోవచ్చు. దీనిని ఎమోషనల్ వెంటింగ్ అంటారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మీ మనసులోని భావోద్వేగాలను బయటకు చెప్పడానికి ఈ థెరపీ ఎంతో బాగా పనిచేస్తుంది. చాలా సినిమాల్లో హీరో లేదా హీరోయిన్లు దిండులో ముఖం పెట్టుకుని ఏడవడం మీరు చూసే ఉంటారు. ఇది కూడా ఒక రకమైన పిల్లో థెరపీయే, ఇది నిజంగానే ఎంతో మేలు చేస్తుంది.

నిపుణులు ఏమంటున్నారు?

సైకాలజిస్ట్‌లు ప్రకారం.. కొన్నిసార్లు మన బాధలను మనస్ఫూర్తిగా పంచుకోవడానికి ఎవరూ ఉండరు. అలాంటి పరిస్థితుల్లో పిల్లో థెరపీ మనకు ఎంలో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎవరూ మన గురించి ఏమో అనుకుంటారనే బాధ లేకుండా మన భావాలను స్వేచ్ఛగా దానితో చెప్పుకోవచ్చు.. పైగా గట్టిగా అరవడం వల్ల డయాఫ్రమ్, కోర్ కండరాలు యాక్టివ్ అవుతాయి, తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఇది మనసుకు ఒక ‘ఎమోషనల్ రీబూట్ బటన్’లా పనిచేస్తూ, ప్రతికూల ఆలోచనలను, ఒత్తిడిని తుడిచిపెట్టేస్తుంది.

పిల్లో థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు:

  • ఆఫీస్ వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది.
  • నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
  • బ్రేకప్ లేదా రిలేషన్‌షిప్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • యాంగ్జైటీ సమస్య తగ్గుతుంది.
  • కోపాన్ని ఎదుటివారిపై చూపించే బదులు దిండుపై చూపించడం వల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి.
  • మీ భావాలను ఎలాంటి సంకోచం లేకుండా బయటపెట్టవచ్చు.
  • భావోద్వేగాలను లోపలే అణచిపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
  • మానసిక ప్రశాంతత దొరుకుతుంది

పిల్లో థెరపీని ఎలా చేయాలి?

  • ఎవరూ లేని ప్రశాంతమైన ఒక గదిని లేదా స్థలాన్ని ఎంచుకోండి.
  • మీరు హత్తుకోవడానికి లేదా ముఖం దాచుకుని అరవడానికి వీలుగా ఉండే ఒక మెత్తటి దిండును తీసుకోండి.
  • మీ లోపల ఉన్న భావాలను స్వేచ్ఛగా బయటకు రానివ్వండి, అది కోపం కావచ్చు, ఏడుపు కావచ్చు లేదా గట్టిగా అరవడం కావచ్చు.
  • మీకు నచ్చితే, ఆ దిండుతో మీ మనసులోని మాటలను ఎవరైనా ఆప్తులతో మాట్లాడినట్లు మాట్లాడండి.
  • కాసేపటికి నెమ్మదిగా మనసును కుదుటపరుచుకుని, కొన్నిసార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి.

పిల్లో థెరపీ ఎందుకు ఇంతగా ట్రెండ్ అవుతోంది?

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్‌లు, ఇంటర్నెట్ రావడంతో చాలా మంది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు కానీ, భావోద్వేగపరంగా తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. పిల్లో థెరపీ కేవలం ఎమోషనల్ హెల్త్‌కి సహాయపడటమే కాకుండా.. ఎలాంటి మందులు అవసరం లేని ఒక సహజసిద్ధమైన చికిత్సగా మారింది. ఎంతో మంది దీన్ని తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు.

అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఈ థెరపీ డిప్రెషన్ లేదా తీవ్రమైన మానసిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదు. ఒకవేళ ఈ థెరపీ తర్వాత కూడా మీకు ఎలాంటి ఉపశమనం లభించకపోతే, తప్పనిసరిగా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *