Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..


Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ” అనే పాటను ప్రపంచంలోనే బెస్ట్ సాంగ్ అని అన్నారు. జీవితంలో నిస్ప్రుహ, నిరాశ ఎదురైనప్పుడు ఈ పాట గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమీ, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయమ్మురా” వంటి పదాలు ఓటమిని అంగీకరించకుండా, నిరంతరం పోరాడాలని గుర్తుచేస్తాయని ఆయన అన్నారు. ఈ పాటలోని సాహిత్యం అద్భుతమైనదని, ప్రతీ పదం గొప్ప అర్థాన్ని కలిగి ఉంటుందని వర్మ ప్రశంసించారు.

“నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రం ఎంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా” వంటి పంక్తులు అసాధ్యాలను సాధించే స్ఫూర్తినిస్తాయి. రెండవ చరణంలో “నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, జీవితాన అడుగు అడుగునా కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు” వంటి పదాలు జీవితం అంటే నిత్య ఘర్షణ అని, దానిని ఎదుర్కొంటూ గెలవడమే నిజమైన జీవితమని బోధిస్తాయి. “ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా” అనే పంక్తులు మనిషి ఆశ, శ్వాస, ఆశయాలే తన ఆయుధాలుగా నిలబడతాయని అన్నారు.

అయితే, “పట్టుదల” సినిమాలో ఈ పాట చిత్రీకరణపై వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమన్ ట్యాంక్ బండ్ మీద బస్కీలు చేస్తూ పరిగెత్తే సన్నివేశాలు పాట లోతైన అర్థాన్ని, గాంభీర్యాన్ని పూర్తిగా వ్యర్థం చేశాయని ఆయన అన్నారు. ఈ పాట బాహుబలి వంటి గొప్ప స్థాయిలో చిత్రీకరించబడి ఉంటే దాని ప్రభావం మరింత బలంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వర్మ తన వ్యక్తిగత జీవిత తత్వాన్ని కూడా ఈ పాటతో ముడిపెట్టారు. తనకు నచ్చినట్లుగా జీవించడమే ముఖ్యమని, అనవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఆయుష్షు పెంచుకోవడం కంటే ఇష్టమైన విధంగా జీవించడమే తన ఫిలాసఫీ అని ఆయన స్పష్టం చేశారు. “కానిదేముందినే కోరుకుంటే పూని సాధించుకోనా పూని” అనే పాటలోని పంక్తి తన ఆలోచనా విధానాన్ని సంక్షిప్తంగా వివరిస్తుందని ఆయన తెలిపారు. కాలేజీ రోజుల్లో తాను కమ్యూనిస్ట్ గా ఉన్నానని, ఆ తర్వాత జ్ఞానోదయం పొంది, తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి దృఢంగా నిలబడాలనే ఆలోచనకు వచ్చానని వర్మ తన వ్యక్తిగత ప్రయాణాన్ని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *