Headlines

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..


సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, చాలా చిన్న వయసులోనే హీరోగా మారి వరుస విజయాలు అందుకున్న ఆయన, కాలక్రమేణా వెండితెరకు దూరమయ్యారు. హరీష్ కుమార్ కేవలం 13-14 ఏళ్ల ప్రాయంలోనే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ ఖైదీ’ (1990) సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయం హరీష్‌కు రాత్రికి రాత్రే స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అగ్ర నటులతో నటించిన అనుభవంతో చాలా చిన్న వయసులోనే హీరోగా ముద్ర వేసుకున్నారు. కథానాయకుడిగా క్రేజ్ తెచ్చుకున్న హరీష్ కుమార్ సరసన ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో నటి సౌందర్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ రకంగా మహానటి సౌందర్యకు మొదటి హీరోగా హరీష్ నిలిచారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘అల్లరి ప్రియుడు’, ‘పెళ్లి సందడి’, ‘ప్రేమ సంబంధం’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో హరీష్ తన నటనా ప్రతిభతో మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ప్రస్తుతం హరీష్ కుమార్ సినీ రంగానికి దూరంగా ఉంటూ ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తూనే, సొంతంగా ఒక బిజినెస్ నడుపుతున్నారు. నటనకు సుదీర్ఘ విరామం ఇచ్చినప్పటికీ, తనకు తగిన మంచి పాత్రలు లేదా వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తే మళ్లీ కెరీర్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. 90ల నాటి గోల్డెన్ డేస్‌ను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఇప్పటికీ ఆయన పాత సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

మనవరాలి పెళ్లి మూవీ..

Manavarali Pelli Movie

Manavarali Pelli Movie

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *