Headlines

Spider: గూడు కట్టకుండా నేలలో నివసించే సాలీడు.. పేద్ద కథే.. ఎర దొరికితే విశ్వరూపం చూపిస్తది

Spider: గూడు కట్టకుండా నేలలో నివసించే సాలీడు.. పేద్ద కథే.. ఎర దొరికితే విశ్వరూపం చూపిస్తది


మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పరిధిలో ఉన్న షెండా పార్క్, ఫుయె కడీ కొండ ప్రాంతాలు అరుదైన జీవవైవిధ్యానికి వేదికగా నిలిచాయి. ఇక్కడి గడ్డి భూముల్లో పరిశోధకులు ఒక విభిన్నమైన ట్రాప్‌డోర్ సాలీడు జాతిని కనుగొన్నారు. ఈ ప్రాంతం గౌరవార్థం దీనికి టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్ అని నామకరణం చేశారు. సాధారణ సాలీళ్లలా ఇవి గూళ్లు అల్లవు; తమ జీవితకాలమంతా నేల అడుగున సుమారు 100 సెంటీమీటర్ల పొడవు ఉండే బొరియల్లోనే గడుపుతాయి. ఈ బొరియలు సాలీడు పరిమాణానికి అనుగుణంగా వెడల్పు అవుతూ, అది స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా నిర్మించుకుంటాయి.

ఈ సాలీళ్ల ప్రత్యేకత ఏమిటంటే, తమ నివాసానికి మట్టి, ఆకులు, కొమ్మలతో కలిపి ఒక రహస్య తలుపును ఏర్పాటు చేసుకోవడం. ఇది పరిసరాలతో కలిసిపోయి ఉండటం వల్ల శత్రువుల కంటపడదు. వీటి వేట పద్ధతి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది; బొరియ తలుపు వద్ద ఏదైనా ఎర కదలికలను పసిగట్టిన వెంటనే, హఠాత్తుగా బయటకు వచ్చి ఎరను లోపలికి లాక్కుంటాయి. ఈ సాలీళ్ల దీర్ఘాయువు కూడా ఆశ్చర్యకరమే. ఒక అధ్యయనం ప్రకారం ఆడ ట్రాప్‌డోర్ సాలీళ్లు గరిష్టంగా 43 ఏళ్ల వరకు జీవించగలవు, కానీ మగ సాలీళ్ల ఆయుష్షు మాత్రం తక్కువగా ఉంటుంది. శివాజీ యూనివర్సిటీ, థాకరే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ సంయుక్తంగా చేసిన ఈ పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో ప్రచురితమయ్యాయి. అయితే, పెరుగుతున్న నిర్మాణ పనులు, ఇతర మొక్కల సాగు వల్ల వీటి ఆవాసాలు దెబ్బతింటున్నాయని, వీటిని రక్షించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

ఇవి కొండచిలువను కొరికి నమిలేస్తాయ్.. తాచుపాము కరిచినా ఏం కాదు.. వేటాడి చంపేస్తాయ్

పొలానికి వెళ్లిన రైతుకు తుప్పల్లో ఏవో కనిపించాయ్.. అవి ఏంటా అని వెళ్లి చూడగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *