Sreeleela: పీరియడ్స్‌తో సినిమా షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ ఏంటో చూశారా? వీడియో

Sreeleela:  పీరియడ్స్‌తో సినిమా షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ ఏంటో చూశారా? వీడియో


Sreeleela:  పీరియడ్స్‌తో సినిమా షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ ఏంటో చూశారా? వీడియో

ప్రపంచం ఎంత ఆధునికంగా మారినా మహిళల విషయంలో కొన్ని విషయాలు మాత్రం ఇంకా మారలేదు. ముఖ్యంగా నెలసరి లేదా రుతుస్రావం గురించి మాట్లాడడానికి ఇప్పటికీ చాలా మంది మహిళలు జంకుతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల పీరియడ్స్ తదితర మహిళల సమస్యలపై ఇన్ స్పైరింగ్ స్పీచ్ ఇచ్చింది. పేరుకు యంగ్ హీరోయిన్ అయినప్పటకీ శ్రీలీలలో సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే పెళ్లి కాకుండానే పిల్లలను దత్తత తీసుకుని మరీ పోషిస్తోంది. మహిళలు, సామాజిక సమస్యలపై బాగా అవగాహన ఉన్న శ్రీలీల లేటెస్ట్ గా ఒక కార్యక్రమానికి హాజరైంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో షూటింగ్‌ల సమయంలో నెలసరి ఇబ్బంది కలిగిస్తుందా అని ఒకరు శ్రీలీలను అడిగారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

“నేను ఇప్పటివరకు చాలా పాటలకు డ్యాన్స్ చేశాను. అయితే అందులో హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు పీరియడ్స్ సమయంలోనే చేసినవే. ఆ పాటలకు సంబంధించి నాకు చాలా ప్రశంసలు లభించాయి. పీరియడ్స్ అనేవి ఒక మహిళకు సాకుగా ఉండకూడదనేది నా అభిప్రాయం. మనం మన శారీరక, మానసిక సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా మనం మహిళలుగా సమాన అవకాశాలు, సమాన అధికారం, సమాన హక్కులు కోరుతున్నప్పుడు, మన నెలసరిని ఒక సాకుగా చూపి ఎలా వెనక్కుపోగలం? మహిళలుగా, మనం మన శారీరక, మానసిక పరిమితులను అధిగమించి ముందుకు సాగాలి. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి. నెలసరి మనకు ఒక సాకుగా ఉండకూడదు’ అని శ్రీలీల సమాధానమిచ్చింది.

కాగానటి శ్రీలీల స్వయంగా వైద్యురాలు కూడా. అందుకే ఆమెకు ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఆమెకున్న పరిజ్ఞానం, ఇలాంటి అంశాలపై మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. శ్రీలీల మాటలకు సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి.

శ్రీలీల కామెంట్స్ వీడియో ఇదిగో..

 

View this post on Instagram

 

A post shared by Celebritydemand (@celebritydemand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *