Tarun : సినిమాల్లోకి తరుణ్ రీఎంట్రీ.. కార్లిటీ ఇచ్చిన రోజా రమణీ.. ఏమన్నారంటే..

Tarun : సినిమాల్లోకి తరుణ్ రీఎంట్రీ.. కార్లిటీ ఇచ్చిన రోజా రమణీ.. ఏమన్నారంటే..


Tarun : సినిమాల్లోకి తరుణ్ రీఎంట్రీ.. కార్లిటీ ఇచ్చిన రోజా రమణీ.. ఏమన్నారంటే..

సీనియర్ హీరోయిన్ రోజా రమణి ఇటీవల ఓ కార్యక్రమంలో తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కొడుకు, నటుడు తరుణ్ వివాహం, రీ-ఎంట్రీ ప్రణాళికలపై కూడా మాట్లాడారు. కెరీర్ పీక్ లో, హీరోయిన్‌గా సౌత్ లో బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నానని రోజా రమణి తెలిపారు. అది ప్రేమ వివాహమని, ఇరు కుటుంబాలు సులభంగా అంగీకరించాయని, ఎటువంటి చేజింగ్ గానీ, అభ్యంతరాలు గానీ లేవని స్పష్టం చేశారు. తన భర్త ఒరియా వ్యక్తి కాదని, తెలుగువారేనని, అయితే ఆయన తండ్రి ఒడిశాలో పనిచేయడం వల్ల అక్కడ చదువుకొని ఒరియా నేర్చుకున్నారని చెప్పారు. తాను ఆయనతో కలిసి ఐదు ఒరియా చిత్రాలలో నటించానని, మొత్తం ఎనిమిది ఒరియా చిత్రాలు చేశానని తెలిపారు. పెళ్లి తర్వాత నటనకు పూర్తి విరామం ప్రకటించడం తన సొంత నిర్ణయమని, ఎవరూ తనను ఆపలేదని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

నటనకు దూరమైనా, డబ్బింగ్ రంగంలోకి ప్రవేశించి సుమారు 600 చిత్రాలకు డబ్బింగ్ చెప్పానని రోజా రమణి వెల్లడించారు. ఉదయం పిల్లలను పాఠశాలకు పంపి, డబ్బింగ్ కు వెళ్ళి, సాయంత్రం పిల్లలు తిరిగి వచ్చేవరకు తాను బిజీగా ఉండేవారినని చెప్పారు. డబ్బింగ్ చేయడం వల్ల మళ్ళీ నటనలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనే రాలేదని తెలిపారు. కొడుకు తరుణ్ తన మొదటి చిత్రం నువ్వే కావాలి తోనే జాతీయ పురస్కారం అందుకున్నారని, తనకు భక్తప్రహ్లాద చిత్రానికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం లభించినట్లు గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ ఐదేళ్లు పూర్తై ఆరో సంవత్సరంలో ప్రారంభం కాగా, తరుణ్ కెరీర్ ఆరేళ్లు పూర్తై ఏడో సంవత్సరంలో ప్రారంభమైందని ఈ అద్భుతమైన పోలికలను ప్రస్తావించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

వాస్తవానికి తరుణ్ లండన్‌లో ఎంబీఏ చేయాలని ప్రణాళిక వేసుకున్నప్పటికీ, నువ్వే కావాలి ఆఫర్ రావడంతో అది బ్రేక్ అయిందని తెలిపారు. తరుణ్ తన కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ చూశారని, ప్రస్తుతం రీ-ఎంట్రీ కోసం ప్రణాళికలు చేసుకుంటున్నారని, వారికి కుటుంబ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉందని రోజా రమణి వెల్లడించారు. పిల్లలకు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని, బాధ్యతలను నిర్వర్తించాలని సలహా ఇస్తుంటానని ఆమె చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *