Headlines

Telangana Weather: అడియాశలు.. తుఫాన్ తీరం దాటే సమయంలోనూ హైదరాబాద్ లో జాడలేని వానచుక్క


బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం నరసాపురానికి సమీపంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి.

ఏపీకి బిన్నంగా తెలంగాణలో పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలో మాత్రం వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే, తెలంగాణలో మాత్రం వాన జాడే కనిపించడం లేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షాలు లేకపోగా, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

తెలంగాణలో వర్షాలు ఎందుకు లేవు

ప్రస్తుతం కొనసాగుతున్న తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా ఉండటంతో అక్కడ బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలో వర్షాలు కురవకపోవడానికి ప్రధాన కారణాల్లో తేమతో కూడిన గాలులు రాష్ట్రంలోకి తగినంతగా విస్తరించకపోవడం ఒకటి కావచ్చు. అంతేకాకుండా, వర్షాలు కురవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడకపోవడం కూడా మరో కారణం కావచ్చు.

తుఫాన్ ప్రభావంతో వీచే గాలుల దిశ కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. తేమతో కూడిన గాలులు తెలంగాణ వైపు వచ్చినప్పటికీ, అవి వర్ష మేఘాలు ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించకపోతే వర్షపాతం తక్కువగానే ఉండవచ్చు. అందుకే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కనిపించినప్పటికీ, వర్షాలు కురవకపోవచ్చు.

తెలంగాణలో వర్షాలు ఎప్పుడు కురుస్తాయి?

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *