Telangana: ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు!

Telangana: ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు!


వరంగల్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిన వితంతు మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేలింది. తనను కాదనే ఆమె మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకుందనే కారణంతో ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని SRSP కెనాల్‌లో ఆమెను కత్తితో గొంతుకోసి హతమార్చినట్టు తెలిపారు.

అయితే మృతురాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వితంతు మహిళ సుమలతగా గుర్తించారు. ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఐదేళ్ల క్రితమే ఆమె భర్త మరణించినట్టు తెలిపారు. అయితే భర్త మరణం తర్వాత ఆమె సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు దర్యాప్తు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే తనతో కాకుండా సుమలత మరో వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తుందన్న అనుమానంతో.. సురేష్‌ ఆమెతో తరచూ గొడవపడేవాడని తెలిపారు.

ఇదే విషయంపై గత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సుమలతపై కోపం పెంచుకున్న సురేష్ ఆమె హత్యకు స్కెచ్ వేశాడని.. పథకం ప్రకారం ఆమెను గ్రామ శివారులోని SRSP కెనాల్ వద్దకు తీసుకెళ్లి అతి దారుణంగా కత్తితో గొంతుకోసి హతమార్చాడని తెలిపారు. ఈ హత్య కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఐదురోజుల వ్యవధిలో మర్డర్ మిస్టరీని ఛేదించామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *