తెలుగు బుల్లితెర చరిత్రలో ‘కార్తీక దీపం’ సీరియల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇందులో ‘దీప’గా, అందరి నోట ‘వంటలక్క’గా పేరుతో పాపులర్ అయ్యింది ప్రేమి విశ్వనాథ్. తన సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, ఆమె తన కెరీర్‌ను ఆర్థికంగా కూడా ఎంతో పటిష్టంగా నిర్మించుకున్నారు. కార్తీక దీపం తర్వాత ఆమె ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక న్యూస్ వైరలవుతుంటుంది.