మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. రీసెంట్‌గానే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా వరుణ్ తేజ్ వాలీ బాల్ ఆటను ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ మోకాలి గాయానికి సంబంధించి వరుణ్ తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయాన్ని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘నా సోదరుడు వరుణ్ తేజ్ ఇటీవల మేం రూపొందిస్తోన్న బరి సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయమైంది. తాజాగా ఆయన్ని పరిశీలించిన డాక్టర్స్ మోకాలికి ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్సను వైద్యులు చక్కగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ప్రస్తుతం వరుణ్ అన్నయ్య డాక్లర్స్ పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు అండగా నిలబడి ప్రేమాభిమానాలు చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
నిహారిక షేర్ చేసిన పోస్ట్ పై సినీ ప్రముఖులు, మెగాభిమానులు స్పందిస్తున్నారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా వరుణ్ తేజ్ హీరోగా ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ యదు వంశీ రూపొందిస్తున్న చిత్రం ‘బరి’. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ గత ఏడు నెలలుగా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ గాయడగా, శస్త్ర చికిత్స నిర్వహించారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కన్నా ముందే కొరియన్ కనకరాజు గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్.
నిహారిక కొణిదెల పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.