Headlines

Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..


Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తున్న సినిమా రణబాలి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యా్ప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయ్, రష్మిక ఇద్దరూ బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ హోస్టింగ్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. రణబాలి చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో సందడి చేశారు విజయ్, రష్మిక. ఇందులో భాగంగా రణబాలి చిత్రం గురించి కాకుండా తమ పర్సనల్ లైఫ్, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే షో జరుగుతున్న సమయంలోనే రాత్రి 11 గంటలకు ఎవరైనా ఒక హీరోకు కాల్ చేయాలని విజయ్ ను అడిగాడు కరణ్. దీంతో విజయ్ వెంటనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కు కాల్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలోనూ బన్నీ విజయ్ కాల్ లిఫ్ట్ చేసి హాలో అని ప్రశాంతంగా అన్నారు.

వెంటనే విజయ్ మాట్లాడుతూ.. “బన్నీ అన్నా.. లేచి ఉన్నారా.. నేను ఇక్కడ కాఫీ విత్ కరణ్ షోలో ఉన్నా.. వీళ్లకు సమయం , సందర్భం అసలు ఏం లేదు. 11.40కి ఎవరికో కాల్ చేయమన్నారు. నేనంటే ఎవరు ఇష్టపడతారు. ఇప్పుడు తిట్టకుండా ఎవరు లిఫ్ట్ చేస్తారు.. నన్ను ప్రేమించేవాళ్లు ఎవరున్నారు ఇండస్ట్రీలో.. ఎవరి దగ్గర చనువు తీసుకోవచ్చని నేను నీకు కాల్ చేశాను. వీళ్లు కరణ్ ఇంకా చెప్పొచ్చా” అని విజయ్ మాట్లాడారు. అయ్యో పర్వాలేదు అంటూ బన్నీ సైతం నవ్వుతూ సరదాగా మాట్లాడారు. అనంతరం కరణ్, రష్మిక సైతం బన్నీతో మాట్లాడారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. బన్నీ, విజయ్ దేవరకొండ స్నేహం గురించి తెలిసి సంతోషిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రణబాలి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇందులో జయమ్మ పాత్రలో రష్మిక, రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనతో మెప్పించారు.

విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ కాల్.. 

 

View this post on Instagram

 

A post shared by Australian Telugu Films (@autelugu_films)

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *